ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తొలి టైటిల్‌ ఊరిస్తోంది..

ABN, First Publish Date - 2021-06-12T10:35:31+05:30

కెరీర్‌లో ఒక్క గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ అయినా సాధించాలన్న కల ప్రతీ టెన్నిస్‌ ప్లేయర్‌కూ ఉంటుంది. అలాంటి సువర్ణావకాశం ఇప్పుడు పవ్లిచెన్‌కోవా (రష్యా)-క్రెజికోవా (చెక్‌)ల ముందుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సాయంత్రం 6.30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌లో..

పవ్లిచెన్‌కోవా X క్రెజికోవా ఫైనల్‌ నేడే 

ఫ్రెంచ్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌


పారిస్‌: కెరీర్‌లో ఒక్క గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ అయినా సాధించాలన్న కల ప్రతీ టెన్నిస్‌ ప్లేయర్‌కూ ఉంటుంది. అలాంటి సువర్ణావకాశం ఇప్పుడు పవ్లిచెన్‌కోవా (రష్యా)-క్రెజికోవా (చెక్‌)ల ముందుంది. శనివారం జరిగే ఫ్రెంచ్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ ఫైనల్లో ఈ ఇద్దరూ తలపడనున్నారు. ఈ ఇద్దరికీ ఇదే తొలి గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌ కావడం విశేషం. స్టార్‌ క్రీడాకారిణులు ఆరంభంలోనే వెనుదిరగడంతో ఈసారి రొలాండ్‌ గారోస్‌లో సరికొత్త చాంపియన్‌ రాబోతోంది. క్రెజికోవాకు గతంలో 2018 ఫ్రెంచ్‌ ఓపెన్‌ డబుల్స్‌లో విజేతగా నిలిచిన అనుభవముంది. అలాగే అదే ఏడాది ఆమె వింబుల్డన్‌ మహిళల డబుల్స్‌లోనూ చాంపియన్‌గా నిలిచింది. కానీ ఇప్పుడు సింగిల్స్‌లోనూ సత్తా నిరూపించుకోవాలనుకుంటోంది. ఇక, ప్రపంచ 32వ ర్యాంకర్‌ పవ్లిచెన్‌కోవా ఈ అవకాశాన్ని చేజార్చుకోకూడదనుకుంటోంది. ఒకవేళ ఆమె విజేతగా నిలిస్తే మిస్కినా (2004), కుజ్‌నెత్సోవా (2009), షరపోవా (2012, 2014) తర్వాత ఫ్రెంచ్‌ టైటిల్‌ గెలిచిన నాలుగో రష్యన్‌గా నిలుస్తుంది. పవ్లిచెన్‌కోవా తన కెరీర్‌లో ఇప్పటిదాకా వింబుల్డన్‌, ఆస్ట్రేలియన్‌, యూఎస్‌ ఓపెన్‌ టోర్నీల్లో క్వార్టర్స్‌కు మాత్రమే చేరగలిగింది.

Updated Date - 2021-06-12T10:35:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising