ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బౌలింగ్‌ చేయకపోతే స్థానం వృథా

ABN, First Publish Date - 2021-05-15T09:19:23+05:30

రెండేళ్ల క్రితం వెన్నెముకకు సర్జరీ తర్వాత ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా రెగ్యులర్‌గా బౌలింగ్‌ చేయలేకపోతున్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 హార్దిక్‌పై మాజీ సెలెక్టర్‌శరణ్‌దీప్‌


న్యూఢిల్లీ: రెండేళ్ల క్రితం వెన్నెముకకు సర్జరీ తర్వాత ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా రెగ్యులర్‌గా బౌలింగ్‌ చేయలేకపోతున్నాడు. ఇటీవలి ఐపీఎల్‌లోనూ అడపాదడపా బౌలింగ్‌ చేశాడు. దీంతో ఆల్‌రౌండర్‌ కోటాలో అతడికి టెస్టు జట్టులోనూ స్థానం దక్కలేదు. అయితే పాండ్యాపై సరైన నిర్ణయమే తీసుకున్నారని మాజీ సెలెక్టర్‌ శరణ్‌ దీప్‌ సింగ్‌ అభిప్రాయపడ్డాడు. ‘ఇంగ్లండ్‌ టూర్‌కు పాండ్యాను పక్కనబెట్టడం అర్థం చేసుకోదగిందే. సర్జరీ తర్వాత తను బౌలింగ్‌కు దూరమవుతున్నాడు. ఇక వన్డేల్లోనూ 10 ఓవర్లు.. టీ20లో నాలుగు ఓవర్లపాటు తను బౌలింగ్‌ చేస్తేనే తుది జట్టులో ఉంచాలి. కేవలం బ్యాట్స్‌మన్‌గా ఉంటే సరిపోదు. ఎందుకంటే జట్టు కూర్పు దెబ్బతింటుంది. అదనపు బౌలర్‌గా మరొకరిని తీసుకుంటే సూర్యకుమార్‌లాంటి వారిని తప్పించాల్సి వస్తుంది’ అని శరణ్‌దీప్‌ సింగ్‌ తెలిపాడు.

Updated Date - 2021-05-15T09:19:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising