ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

1983 వరల్డ్ కప్ జట్టు సభ్యుడు యశ్‌పాల్ కన్నుమూత

ABN, First Publish Date - 2021-07-13T17:19:02+05:30

టీమిండియా మాజీ ఆటగాడు, 1983 వరల్డ్ కప్‌ జట్టులో సభ్యుడు యశ్‌పాల్ శర్మ కన్నుమూశారు. 66 ఏళ్ల శర్మ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ ఆటగాడు, 1983 వరల్డ్ కప్‌ జట్టులో సభ్యుడు యశ్‌పాల్ శర్మ కన్నుమూశారు. 66 ఏళ్ల శర్మ మంగళవారం ఉదయం గుండెపోటుతో చనిపోయారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. 


యశ్‌పాల్ శర్మ 70, 80లలో భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. పంజాబ్‌లోని లుథియానాలో 1954 ఆగస్ట్ 11న జన్మించారు. ఇంగ్లండ్ జట్టుపై తొలి టెస్ట్ ఆడిన యశ్ పాల్ శర్మ.. తన కెరీర్ మెుత్తంలో 37 టెస్టులాడారు. రెండు సెంచరీలు, 9 అర్ధసెంచరీలతో మొత్తం 1606 పరుగులు చేశారు. 


1978లో పాకిస్థాన్‌తో శర్మ తొలి వన్డే ఆడారు. ఇక దేశవాళీ క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు. హర్యానా, రైల్వే జట్లకు ప్రాతినిద్యం వహించిన ఆయన 21 సెంచరీలతో 8933 పరుగులు చేశారు. రిటైర్మెంట్ తర్వాత బీసీసీఐలో పలు కీలక పదవులు నిర్వహించారు. ప్రముఖ ఛానల్‌లో క్రికెట్ విశ్లేషకుడిగా కూడా వ్యవహరించారు. 

Updated Date - 2021-07-13T17:19:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising