ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ కన్నుమూత

ABN, First Publish Date - 2021-10-31T23:56:53+05:30

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆస్ట్రేలియా మాజీ టెస్టు క్రికెట్ పీటర్ ఫిల్‌పట్ అనారోగ్యంతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిడ్నీ: గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆస్ట్రేలియా మాజీ టెస్టు క్రికెటర్ పీటర్ ఫిల్‌పట్ అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన వయసు 86 సంవత్సరాలు. న్యూసౌత్‌వేల్స్ జట్టు మాజీ కెప్టెన్ అయిన ఈ లెగ్‌స్పిన్ ఆల్‌రౌండర్ 1960లలో ఆస్ట్రేలియా తరపున జాతీయ జట్టుకు ప్రాతనిధ్యం వహించాడు.


38.46 సగటుతో 26 వికెట్లు తీసుకున్నాడు. 1965లో కింగ్‌స్టన్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌తో టెస్టుల్లోకి అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 56 పరుగులిచ్చి రెండు, రెండో ఇన్నింగ్స్‌లో 109 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఆ పర్యటనలో ఫీటర్ 34.94 సగటుతో 18 వికెట్లు పడగొట్టాడు.


ఆ ఏడాది చివర్లో ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి యాషెస్ టెస్టులో 90 పరుగులిచ్చి 5 వికెట్లు తీసుకున్నాడు. ఆ సిరీస్‌లో మరో రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడిన పీటర్ 31 ఏళ్ల వయసులో క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. కాగా, ఆసీస్ దిగ్గజ మాజీ ఆల్‌రౌండర్ అలన్ డేవిడ్‌సన్ కన్నుమూసిన తర్వాతి రోజే పీటర్ మృతి చెందడంతో ఆసీస్ క్రికెట్ విషాదంలో మునిగిపోయింది. 

Updated Date - 2021-10-31T23:56:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising