ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇండియా వర్సెస్ ఇంగ్లండ్: తొలి రెండు టెస్టులు ప్రేక్షకులు లేకుండానే!

ABN, First Publish Date - 2021-01-23T22:23:07+05:30

భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య వచ్చే నెలలో స్వదేశంలో టెస్టు సిరీస్ ప్రారంభం కానుండగా, తొలి రెండు టెస్టులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య వచ్చే నెలలో స్వదేశంలో టెస్టు సిరీస్ ప్రారంభం కానుండగా, తొలి రెండు టెస్టులు ప్రేక్షకులు లేకుండానే జరగనున్నాయి. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం ఈ రెండు టెస్టులకు ఆతిథ్యం ఇవ్వనుంది. బీసీసీఐ ఆదేశాల ప్రకారం ఇక్కడ జరిగే రెండు టెస్టులకు ప్రేక్షకులను అనుమతించబోమని తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ (టీఎన్‌సీఏ) కార్యదర్శి ఆర్ఎస్ రామసామి తెలిపారు. కొవిడ్-19 నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. 


కరోనా వైరస్ నేపథ్యంలో ఆటగాళ్ల భద్రత విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోకూడదని బీసీసీఐ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే చిదంబరం స్టేడియంలో జరిగే తొలి రెండు టెస్టులను క్లోజ్‌డ్ డోర్స్ మధ్యే నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నెల 27న భారత్, ఇంగ్లండ్ జట్లు చెన్నై చేరుకుంటాయి. బయో బబుల్‌లోకి వెళ్లడానికి ముందు ఇరు జట్ల ఆటగాళ్లకు కరోనా పరీక్షలు నిర్వహిస్తారు. ఫిబ్రవరి 5న తొలి టెస్టు ప్రారంభం అవుతుంది.

Updated Date - 2021-01-23T22:23:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising