ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

England vs India: మూడో టెస్టులో కోహ్లీసేనకు దారుణ పరాభవం

ABN, First Publish Date - 2021-08-28T22:52:18+05:30

అనుకున్నదే అయింది. ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో భారత జట్టు ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లీడ్స్: అనుకున్నదే అయింది. ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో భారత జట్టు ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ను 278 పరుగులకే కుప్పకూల్చిన ఇంగ్లండ్ మరో రోజు మిగిలి ఉండగానే ఇన్నింగ్స్ 76 పరుగుల తేడాతో  విజయం సాధించి ఐదు టెస్టుల సిరీస్‌ను 1-1తో సమం చేసింది.


నిన్న మూడో రోజు ఇంగ్లండ్‌పై పైచేయి సాధించిన భారత జట్టు నేడు నాలుగో రోజు ప్రారంభం నుంచే వికెట్లను కోల్పోయింది. 215/2తో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత జట్టు వికెట్లను టపటపా రాల్చుకుంది. సెంచరీ చేయడం ఖాయమని భావించిన పుజారా 91 పరుగుల ఓవర్ నైట్ స్కోరుకు ఒక్క పరుగు కూడా జోడించకుండానే అవుటయ్యాడు. అది మొదలు వికెట్ల ప్రవాహం కొనసాగింది. ఆ తర్వాత అర్ధ సెంచరీ పూర్తి చేసి ఊపులో ఉన్నట్టు కనిపించిన కెప్టెన్ కోహ్లీ (55) అవుట్‌తో భారత జట్టు ఓటమి ఖాయమైంది. 


రహానే (10), రిషభ్ పంత్ (1), షమీ (6), ఇషాంత్ శర్మ (2), సిరాజ్ (0) క్రీజులోకి వచ్చినట్టే వచ్చి వెనుదిరిగారు. రవీంద్ర జడేజా మాత్రం కాసేపు పోరాడాడు. క్రీజులో ఉన్నంత సేపు మెరుపులు మెరిపించాడు. 25 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్‌తో 30 పరుగులు చేశాడు. 


ఇక, ఆతిథ్య ఇంగ్లిష్ బౌలర్లలో ఒల్లీ రాబిన్సన్ ఐదు వికెట్లతో భారత టాపార్డర్‌ను కకావికలం చేయగా, ఓవెర్టన్ మూడు వికెట్లతో మిగతా పని పూర్తి చేశాడు. అండర్సన్, మొయీన్ అలీ చెరో వికెట్ తీసుకున్నారు.


అంతకుముందు భారత జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో అత్యంత దారుణంగా 78 పరుగులకే ఆలౌట్ కాగా, ఇంగ్లండ్ తన తొలి ఇన్నింగ్స్‌లో 432 పరుగుల భారీ స్కోరు సాధించి టీమిండియాకు సవాలు విసిరింది. ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ ఈ సిరీస్‌లో వరుసగా మూడో సెంచరీ (121)తో విరుచుకుపడగా, ఓపెనర్లు రోరీ బర్న్స్ (61), హసీబ్ హమీద్ (68), మలాన్ (70) అర్ధ సెంచరీలతో అలరించారు. సెప్టెంబరు 2న లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో ఇరు జట్ల మధ్య నాలుగో టెస్టు ప్రారంభం అవుతుంది.

Updated Date - 2021-08-28T22:52:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising