England vs India: తగ్గిన వర్షం.. పడిన టాస్
ABN, First Publish Date - 2021-08-12T21:02:21+05:30
టీమిండియాతో జరగనున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. వర్షం కారణంగా టాస్ కాస్తంత ఆలస్యంగా
లండన్: టీమిండియాతో జరగనున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. వర్షం కారణంగా టాస్ కాస్తంత ఆలస్యంగా పడింది. దీంతో మ్యాచ్ నిర్ణీత సమయానికి పావుగంట ఆలస్యంగా 3.45 గంటలకు ప్రారంభం కానుంది. ఇంగ్లండ్ జట్టులో మూడు మార్పులు చోటుచేసుకున్నాయి. క్రాలీ స్థానంలో హమీద్, బ్రాడ్ స్థానంలో మార్క్ వుడ్, లారెన్స్ స్థానంలో మొయీన్ అలీ జట్టులోకి వచ్చారు. భారత జట్టు మాత్రం ఒకే ఒక్క మార్పుతో బరిలోకి దిగుతోంది. శార్దూల్ స్థానంలో ఇషాంత్ శర్మ తుది జట్టులోకి వచ్చాడు.
భారత జట్టు: రోహిత్‌శర్మ, కేఎల్ రాహుల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్య రహానే, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్
ఇంగ్లండ్ జట్టు: రోరీ బర్న్స్, డొమినిక్ సిబ్లీ, హసీబ్ హమీద్, జో రూట్ (కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), మొయీన్ అలీ, శామ్ కరన్, ఒల్లీ రాబిన్సన్, మార్క్ వుడ్, జేమ్స్ అండర్సన్
Updated Date - 2021-08-12T21:02:21+05:30 IST