ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kanpur Test: ప్రభావం చూపని భారత బౌలర్లు.. కివీస్ ఓపెనర్ల రికార్డు భాగస్వామ్యం

ABN, First Publish Date - 2021-11-26T22:22:07+05:30

భారత్‌తో ఇక్కడి గ్రీన్‌పార్క్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. న్యూజిలాండ్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాన్పూరు: భారత్‌తో ఇక్కడి గ్రీన్‌పార్క్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. న్యూజిలాండ్ వికెట్ నష్టపోకుండా 129 పరుగులు చేసి పటిష్ఠ స్థితిలో నిలిచింది. ఓపెనర్లు విల్ యంగ్ (75), టామ్ లాథమ్ (50) అర్ధ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ ముప్పుతిప్పలు పెట్టారు. కెప్టెన్ అజింక్య రహానే ఐదుగురు బౌలర్లను ప్రయోగించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. చెత్తబంతులను బౌండరీలకు తరలిస్తూ రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇండియాలో న్యూజిలాండ్‌కు ఇది మూడో అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం కావడం గమనార్హం.


అంతకుముందు ఈ ఉదయం ఓవర్‌నైట్ స్కోరు 258/4తో రెండో రోజు తొలి  ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 345 పరుగులకు ఆలౌట్ అయింది. తొలి రోజు సూపర్ షోతో ఆకట్టుకున్న శ్రేయాస్ అయ్యర్ సెంచరీ (105) పరుగులకు అవుటగా, రవీంద్ర జడేజా (50), అశ్విన్ 38 పరుగులు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో సౌథీ 5, జెమీసన్ 3, అజాజ్ పటేల్ 2 వికెట్లు పడగొట్టారు.

Updated Date - 2021-11-26T22:22:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising