ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యూఎస్‌ ఓపెన్‌: మహిళల సింగిల్స్‌ టైటిల్ ఎమ్మా రుదికాను సొంతం

ABN, First Publish Date - 2021-09-12T15:18:00+05:30

యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూయార్క్: యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను బ్రిటిష్ క్రీడాకారిణి ఎమ్మా రదుకాను దక్కించుకున్నారు. ఫైనల్స్‌లో కెనాడాకు చెందిన 19 ఏళ్ల లెలా ఫెర్నాండెజ్‌ను 6-4, 6-3 తేడాతో ఓడించారు. ఫలితంగా ఎమ్మా రుదకాను తన కెరియర్‌లో తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను సొంతం చేసుకున్నారు.  ఫైనల్ పోరులో 150వ ర్యాంక్‌లో కొనసాగిన ఎమ్మా రుదకాను.. తనకన్నా మెరుగైన స్థానంలో నిలిచిన 73వ ర్యాంక్‌ క్రీడాకారిణి లెలా ఫెర్నాండెజ్‌ను ఓడించడం విశేషం. 


ఈ విజయంతో ఎమ్మా.. కొత్త రికార్డు సృష్టించారు. 17 ఏళ్ల వయసులోనే గ్రాండ్ స్లామ్ టైటిల్ దక్కించుకున్న క్రీడాకారిణిగా ఎమ్మా రికార్డు నెలకొల్పారు. గతంలో క్రీడాకారిణి మారియా షరపోవా కూడా 2004లో 17 ఏళ్ల వయసులోనే వింబుల్డన్‌ టైటిల్‌ దక్కించుకున్నారు. గ్రాండ్ స్లామ్ విజయం సొంతం చేసుకున్న ఎమ్మా 2.5 మిలయన్‌ డాలర్ల ప్రైజ్‌ మనీ దక్కించుకున్నారు.  ఈ ఘన విజయంతో ఎమ్మా ర్యాంకింగ్‌ విషయంలో 150వ స్థానం నుంచి 23వ స్థానానికి చేరుకున్నారు. అంటే ఒక్కసారిగా 127 ర్యాంకులు దాటి ముందుకు వెళ్లారు. ఇంతటి ఘన విజయం సాధించిన ఎమ్మా రుదుకానును బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్- II అభినందనలతో ముంచెత్తారు.

Updated Date - 2021-09-12T15:18:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising