ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్ర్పింట్‌లో ద్యూతి నయా రికార్డు

ABN, First Publish Date - 2021-06-22T05:59:34+05:30

ఇండియన్‌ గ్రాండ్‌ ప్రీ మహిళల 100 మీటర్ల స్ర్పింట్‌లో స్టార్‌ అథ్లెట్‌ ద్యూతీ చంద్‌ సత్తా చాటింది. ఈ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఇండియన్‌ గ్రాండ్‌ ప్రీ మహిళల 100 మీటర్ల స్ర్పింట్‌లో స్టార్‌ అథ్లెట్‌ ద్యూతీ చంద్‌ సత్తా చాటింది. ఈ కేటగిరీలో తన పేరిట ఉన్న 11.22 సెకన్ల జాతీయ రికార్డును ద్యూతి సోమవారం జరిగిన ఒకరోజు గ్రాండ్‌ ప్రీలో తిరగరాసింది. పటియాలలో జరిగిన ఈ మీట్‌లో ద్యూతి 11.17 సెకన్లలో రేసును పూర్తి చేసి కొత్త రికార్డును నమోదు చేసింది. మరో రెండు సెకన్ల ముందుగా అంటే 11.15 సెకన్లలో రేసును ముగించుంటే ద్యూతి టోక్యో ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత సాధించేది. ఈ నెల 25న జరగనున్న అంతర్‌ రాష్ట్ర జాతీయ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షి్‌ప ద్యూతికి టోక్యో ఒలింపిక్స్‌లో నేరుగా పాల్గొనేందుకు ఉన్న చివరి అవకాశం.


ఇక, 4్ఠ 100 మీటర్ల మహిళల రిలేలో కూడా జాతీయ రికార్డు బద్దలైంది. గతంలో 43.42 సెకన్లుగా ఉన్న ఈ రికార్డును స్టార్‌ స్ర్పింటర్లు ద్యూతీ చంద్‌, హిమా దాస్‌, ధనలక్ష్మి, అర్చన కలిసి తిరగరాశారు. 43.37 సెకన్లలో రేసు ముగించి కొత్త రికార్డును నెలకొల్పారు. పంజాబ్‌ షాట్‌పుటర్‌ తజిందర్‌ సింగ్‌ జాతీయ రికార్డును బద్దలు కొట్టి టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. ఒలింపిక్‌ క్వాలిఫికేషన్‌ మార్క్‌ 21.10 మీటర్లు కాగా, తజిందర్‌ 21.49 మీటర్లు విసిరి తన గత జాతీయ రికార్డు (20.92 మీ.)ను కూడా అధిగమించాడు.


Updated Date - 2021-06-22T05:59:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising