ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్‌పై పోరుకు ధవన్‌, ఉనాద్కట్‌, పూరన్‌ విరాళం

ABN, First Publish Date - 2021-05-01T09:14:35+05:30

దేశంలో కరోనా బాధితులను ఆదుకునేందుకు పలువురు క్రికెటర్లు ముందుకు వస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశంలో కరోనా బాధితులను ఆదుకునేందుకు పలువురు క్రికెటర్లు ముందుకు వస్తున్నారు. రాజస్థాన్‌ పేసర్‌ జైదేవ్‌ ఉనాద్కట్‌ తన ఐపీఎల్‌ వేతనంలో పది శాతాన్ని విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించాడు. అత్యవసర మెడికల్‌ సామగ్రి కొనుగోలుకు ఈ డబ్బును వినియోగించాలని అతడు కోరాడు. గతేడాది వేలంలో అతడిని ఆర్‌ఆర్‌ జట్టు రూ.3 కోట్లకు కొనుగోలు చేసింది. అలాగే పంజాబ్‌ ప్లేయర్‌ నికోలస్‌ పూరన్‌ కూడా ఐపీఎల్‌ వేతనంలో కొంత భాగాన్ని విరాళంగా ఇస్తానని తెలిపాడు. ఇక, టీమిండియా ఓపెనర్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ స్టార్‌ శిఖర్‌ ధవన్‌ రూ. 20 లక్షలు విరాళంగా ప్రకటించాడు. ఆక్సిజన్‌ సిలిండర్లు, కాన్‌సన్‌ట్రేటర్స్‌ కొనేందుకుగాను ఆక్సిజన్‌ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థకు ఈ మొత్తాన్ని ఇవ్వనున్నట్టు ధవన్‌ సోషల్‌ మీడియాలో తెలిపాడు. ఇప్పటికే కమిన్స్‌, బ్రెట్‌ లీ, సచిన్‌, ఢిల్లీ, రాజస్థాన్‌ జట్లు సాయం చేసిన సంగతి తెలిసిందే.

Updated Date - 2021-05-01T09:14:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising