ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పడిక్కల్ వీరబాదుడు.. వరుసగా నాలుగో సెంచరీతో అరుదైన రికార్డు

ABN, First Publish Date - 2021-03-09T02:22:44+05:30

ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు ముందు అద్భుత ఆటతీరుతో జాతీయ సెలక్టర్ల దృష్టిని తనవైపు తిప్పుకుంటున్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: విజయ్ హజారే ట్రోఫీలో యువ ఓపెనర్ దేవదత్ పడిక్కల్ చెలరేగిపోతున్నాడు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు ముందు అద్భుత ఆటతీరుతో జాతీయ సెలక్టర్ల దృష్టిని తనవైపు తిప్పుకుంటున్నాడు. వరుసగా నాలుగో లిస్ట్-ఎ సెంచరీ నమోదు చేశాడు. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా నేడు ఢిల్లీలో కేరళతో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో కర్ణాటక 80 పరుగుల తేడాతో విజయం సాధించింది. కర్ణాటక స్కిప్పర్ రవికుమార్ సమర్థ్ 158 బంతుల్లో 22 ఫోర్లు, 3 సిక్సర్లతో 192 పరుగులు చేయగా, 20 ఏళ్ల పడిక్కల్ కూడా ఏమాత్రం తగ్గకుండా ఆడాడు. 119 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 101 పరుగులు చేశాడు. ఇద్దరూ కలిసి తొలి వికెట్‌కు 249 పరుగులు జోడించారు. ఫలితంగా కర్ణాటక నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 38 పరుగులు చేసింది. 


భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కేరళ జట్టు 258 పరుగులకే కుప్పకూలి పరాజయం పాలైంది. ఈ విజయంతో కర్ణాటక జట్టు సెమీస్‌లోకి ప్రవేశించింది. విజయ్ హజారే ట్రోఫీలో పడిక్కల్‌కు ఇది వరుసగా నాలుగో సెంచరీ. ఫలితంగా వరుసగా నాలుగు లిస్ట్-ఎ సెంచరీలు నమోదు చేసిన తొలి ఇండియన్‌గా రికార్డులకెక్కాడు. ఇక, కెప్టెన్ సమర్థ్ విజయ్ హజారే ట్రోఫీలో అత్యధిక వ్యక్తిగత స్కోరు (192) నమోదు చేశాడు. ఈ క్రమంలో వసీం జాఫర్ పేరిట ఉన్న అజేయ 170 పరుగుల రికార్డును సమర్థ్ తుడిచిపెట్టేశాడు. 

Updated Date - 2021-03-09T02:22:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising