ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఢిల్లీలో వచ్చే వారం నుంచి జిమ్‌లు ప్రారంభం!

ABN, First Publish Date - 2021-06-25T12:38:51+05:30

దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో వచ్చే వారం నుంచి జిమ్‌లను తెరిచే అవకాశం ఉంది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో వచ్చే వారం నుంచి జిమ్‌లను తెరిచే అవకాశం ఉంది. కరోనా వైరస్ తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఢిల్లీలో అన్ లాక్ చేయడంతో జిమ్ లు తెరవడానికి అనుమతి ఇవ్వాలని ఢిల్లీ జిమ్ అసోసియేషన్ రాష్ట్ర  ప్రభుత్వాన్ని కోరింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ ను ఢిల్లీ జిమ్ అసోసియేషన్ సభ్యులు సమావేశం అయ్యాక మీడియాతో మాట్లాడారు. జిమ్ లు తెరిచేందుకు అనుమతించాలని తాము సీఎం కేజ్రీవాల్ ను కోరగా, సానుకూల స్పందన వచ్చిందని, వచ్చే వారం నుంచి జిమ్ లను తెరవడానికి అనుమతిస్తామని సీఎం తమకు హామి ఇచ్చినట్లు జిమ్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు చిరాగ్ సేథి చెప్పారు.


 గత ఏడాది కాలంలో 6 నెలలపాటు ఢిల్లీలోని 5,500 జిమ్ లను మూసివేశామని, దీనివల్ల యజమానులకు తీరని నష్టం జరిగిందని సీఎంకు నివేదించారు.  జిమ్ లను మూసివేయడం వల్ల విద్యుత్, నీరు, అద్దెలు, సిబ్బంది జీతాలు చెల్లించడం భారంగా మారిందని జిమ్ యజమానులు ఆవేదనగా చెప్పారు. ఢిల్లీలో ఇప్పటికే బార్ లు, పబ్లిక్ పార్కులను తెరచినందున జిమ్ లను ప్రారంభించేందుకు వచ్చే వారం అనుమతి ఇస్తారని జిమ్ యజమానులు చెపుతున్నారు. కాని దీనిపై ఢిల్లీ సర్కారు నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.

Updated Date - 2021-06-25T12:38:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising