ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డబ్ల్యూటీసీ ఫైనల్: తొలిరోజు ఆట వర్షార్పణం

ABN, First Publish Date - 2021-06-19T01:16:16+05:30

భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరగాల్సిన ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ తొలి రోజు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సౌతాంప్టన్: భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరగాల్సిన ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ తొలి రోజు ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది. సౌతాంప్టన్‌లో ఉదయం నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తుండడంతో రోజ్‌బౌల్ స్టేడియం నీటితో నిండిపోయింది. ఫస్ట్ సెషన్ కూడా సాగకపోవడంతో భోజన విరామం ప్రకటించారు. ఆ తర్వాత వర్షం కొంత తగ్గుముఖం పట్టడంతో ఆశలు చిగురించాయి. అయితే, మైదానం మొత్తం నీటితో నిండిపోవడం, చినుకులు పడుతుండడంతో తొలి రోజు ఆటను రద్దు చేస్తున్నట్టు అంపైర్లు ప్రకటించారు. రేపు కనుక వర్షం నెమ్మదించి వాతావరణం అనుకూలిస్తే నేడు కోల్పోయిన సమయాన్ని రిజర్వు డే నాడు నిర్వహించే అవకాశం ఉంది. రేపు కూడా వరుణుడు ప్రభావం చూపితే మ్యాచ్‌ను రద్దు చేసి ఇరు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించే అవకాశం ఉంది. వర్షం కారణంగా దురదృష్టవశాత్తు తొలి రోజు మ్యాచ్ రద్దు అయిందని, రేపు మామూలుగానే నిర్ణీత సమయానికి మ్యాచ్ ప్రారంభం అవుతుందని బీసీసీఐ ట్వీట్ చేసింది.

Updated Date - 2021-06-19T01:16:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising