ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అల్లు అర్జున్ ఫేస్ మార్చేసిన డేవిడ్ వార్నర్

ABN, First Publish Date - 2021-12-12T01:57:44+05:30

యాసెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో చెలరేగి కొద్దిలో సెంచరీ మిస్ చేసుకున్న ఆసీస్ ఓపెనర్..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బ్రిస్బేన్: యాసెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో చెలరేగి కొద్దిలో సెంచరీ మిస్ చేసుకున్న ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్  సోషల్ మీడియా వేదికగా చెలరేగిపోయాడు. తెలుగు సినిమా పాటలకు స్టెప్పులేస్తూ, డైలాగులు చెబుతూ సామాజిక మాధ్యమాల్లో సందడి చేసే ఈ ఆసీస్ స్టార్ తాజాగా మరోమారు ఇన్‌స్టాగ్రామ్‌కెక్కి అభిమానులకు బోల్డంత వినోదాన్ని పంచాడు. ఈసారి అల్లు అర్జున్ ఫేస్‌తో వచ్చేశాడు.


టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమా నుంచి ఇటీవల ‘బిడ్డా ఇది నా అడ్డా..’ అంటూ సాగే పాట విడుదలైంది. యూట్యూబ్‌లో దూసుకుపోతున్న ఈ వీడియోను మార్ఫింగ్ చేసి  తన ఫొటోను తగిలించేశాడు.


‘ఏయ్ బిడ్డా... ’ అంటూ క్రికెట్ ఫ్యాన్స్‌నే కాదు.. తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నాడు. దీనిని చూసిన పలువురు క్రికెటర్లు కూడా తమాషాగా స్పందిస్తున్నారు. విరాట్ కోహ్లీ అయితే.. ‘‘మేట్.. నీకేం కాలేదు కదా’’ అంటూ నవ్వుతున్న ఎమోజీతో కామెంట్ చేశాడు. ఆసీస్ మాజీ క్రికెటర్ మిచెల్ జాన్సన్ .. నవ్వుతున్న ఎమోజీతో ‘ఆపవా ప్లీజ్’ అని కామెంట్ చేశాడు. వార్నర్ పుష్పను మీరూ చూసేయండి.



Updated Date - 2021-12-12T01:57:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising