ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జట్టులోనూ చోటు లేదు

ABN, First Publish Date - 2021-05-03T09:57:09+05:30

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్సీ కోల్పోయిన డేవిడ్‌ వార్నర్‌కు మరో షాక్‌. జట్టులో ఆటగాడిగానూ అతడికి ఉద్వాసన పలికింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆటగాడిగానూ వార్నర్‌కు ఉద్వాసన

న్యూఢిల్లీ: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్సీ కోల్పోయిన డేవిడ్‌ వార్నర్‌కు మరో షాక్‌. జట్టులో ఆటగాడిగానూ అతడికి ఉద్వాసన పలికింది మేనేజ్‌మెంట్‌. ఆదివారం రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో తుది జట్టు నుంచి వార్నర్‌ను తప్పించారు. ‘ఇది కఠిన నిర్ణయమే. జట్టులో ఎవరో ఒకరిని తప్పించాల్సిన పరిస్థితి. దురదృష్టవశాత్తూ ఆ స్థానంలో వార్నర్‌ ఉన్నాడు. అతను కూడా షాక్‌కు గురయ్యాడు. ఇది అందరినీ నిరాశపరిచేదే’ అని రైజర్స్‌ టీమ్‌ డైరెక్టర్‌ టామ్‌ మూడీ అన్నాడు. వార్నర్‌ స్థానంలో విలియమ్సన్‌ను జట్టు కెప్టెన్‌గా నియమించిన సంగతి తెలిసిందే.


రాజస్థాన్‌తో మ్యాచ్‌కు వార్నర్‌, సుచిత్‌, సిద్దార్థ్‌ కౌల్‌ స్థానాల్లో అఫ్ఘాన్‌ ఆల్‌రౌండర్‌ మహ్మద్‌ నబీ, అబ్దుల్‌ సమద్‌, భువనేశ్వర్‌ను జట్టులోకి తీసుకున్నారు.  ఈ సీజన్‌లో వార్నర్‌ సారథ్యంలో ఆరు మ్యాచ్‌లాడిన రైజర్స్‌ ఒకే ఒక విజయాన్నందుకుంది. కెప్టెన్సీలో విఫలమైన వార్నర్‌.. ఆటగాడిగానూ అంతగా ఆకట్టుకోలేకపోతున్నాడన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వార్నర్‌ ఆరు మ్యాచుల్లో వరుసగా 3, 54, 36, 37, 6, 57 పరుగులు చేసినా వేగంగా ఆడలేకపోతున్నాడు. 

Updated Date - 2021-05-03T09:57:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising