ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధోనీకి చివరి ఐపీఎల్ ఇదేనా..? క్లారిటీ ఇచ్చిన సీఎస్‌కే

ABN, First Publish Date - 2021-04-09T01:09:24+05:30

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్ నుంచి గతేడాది వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. టీ20 ప్రపంచకప్ వరకు జాతీయ జట్టుకు ఆడతాడనుకున్న అభిమానుల ఆశలపై నీళ్లు చల్లాడు. అయితే ఐపీఎల్‌లో మాత్రం కొనసాగుతానంటూ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్ నుంచి గతేడాది వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. టీ20 ప్రపంచకప్ వరకు జాతీయ జట్టుకు ఆడతాడనుకున్న అభిమానుల ఆశలపై నీళ్లు చల్లాడు. అయితే ఐపీఎల్‌లో మాత్రం కొనసాగుతానంటూ కొంత ఊరటనిచ్చాడు. రిటైర్మెంట్ తరువాత ధోనీకిది రెండో ఐపీఎల్. ఈ క్రమంలోనే ధోనీకిదే ఆఖరి ఐపీఎల్ అని, ఈ టోర్నీ తరువాత ధోనీ ఇక టోర్నీలో ఆడడంటూ అనేక రూమర్లు వినిపిస్తున్నాయి. వీటిపై ధోనీ ఇప్పటివరకు స్పందించలేదు. అయితే ఈ రూమర్లపై సీఎస్‌కే సీఈవో కాశీ విశ్వనాథన్ స్పందించారు. ధోనీకిది చివరి సీజన్ కాదని, అతడు కచ్చితంగా భవిష్యత్తులోనూ ఐపీఎల్ ఆడతాడని అన్నారు. అంతేకాకుండా ధోనీ స్థానంలో మరో ఆటగాడి గురించిన ఆలోచన లేదని వివరించాడు. ఇక పుజారా కూడా గొప్ప బ్యాట్స్‌మన్ అని, అద్భుతమైన టెక్నిక్‌తో ఏ ఫార్మాట్‌కైనా తనను తాను మలచుకోగలడన్న నమ్మకంతోనే అతడిని తీసుకున్నామని విశ్వనాథన్ తెలిపారు. అతడిని గౌరవించాలనే ఉద్దేశంతోనే వేలంలో కొనుగోలు చేశామని తెలిపారు.


Updated Date - 2021-04-09T01:09:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising