ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐపీఎల్‌ కోసం కౌంటీలు సిద్ధం

ABN, First Publish Date - 2021-05-07T10:17:41+05:30

ఐపీఎల్‌లో మిగతా సగం మ్యాచ్‌లను నిర్వహించేందుకు ఇంగ్లండ్‌లోని కౌంటీలు ముందుకు వచ్చాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండన్‌: ఐపీఎల్‌లో మిగతా సగం మ్యాచ్‌లను నిర్వహించేందుకు ఇంగ్లండ్‌లోని కౌంటీలు ముందుకు వచ్చాయి. బీసీసీఐకి ఈ విషయం తెలపాల్సిందిగా ఎంసీసీ, సర్రే, వార్విక్‌షైర్‌, ఓవల్‌, ఎడ్జ్‌బాస్టన్‌ కౌంటీ క్లబ్బులు ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ)కు లేఖ రాశాయి. లీగ్‌ను సెప్టెంబరు రెండో వారంలో ఆరంభించి రెండు వారాల్లోపు ముగిసేలా ప్రణాళికలు రచించాలని కోరాయి. ఇదే జరిగితే టీ20 ప్రపంచక్‌పనకు ముందే టాప్‌ క్రికెటర్లకు మంచి ప్రాక్టీస్‌ లభించినట్టవుతుందని అభిప్రాయపడ్డాయి. యూకే మార్కెట్‌కు కూడా లాభదాయకమేనని పేర్కొన్నాయి. ఇంగ్లండ్‌లో కేసులు ఎక్కువగా లేవు కాబట్టి మ్యాచ్‌లను కూడా ప్రేక్షకుల మధ్యన ఆడించవచ్చు.


అయితే ప్రపంచవ్యాప్త క్రికెటర్ల రాకతో వారందరినీ క్వారంటైన్‌లో ఉంచడం అక్కడ సమస్య కావచ్చు. భారత్‌-ఇంగ్లండ్‌ సిరీస్‌ సెప్టెంబరు 14న ముగుస్తుంది. ఆ వెంటనే ఇంగ్లండ్‌ జట్టు పాక్‌, బంగ్లాదేశ్‌ టూర్లకు వెళ్లాలి. కాబట్టి అక్కడ జరపడం అంత సులువు కాకపోవచ్చు. అయినా ఏదో ఓ విండో లభిస్తే రోజుకు రెండు మ్యాచ్‌లను ఆడించైనా లీగ్‌ను జరపాలని కౌంటీలు కోరుకుంటున్నాయి.

Updated Date - 2021-05-07T10:17:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising