ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్చర్ లేని లోటు మోరిస్ తీర్చగలడా..?

ABN, First Publish Date - 2021-04-13T00:30:22+05:30

సరికొత్త కెప్టెన్‌తో ఈ ఏడాది ఐపీఎల్‌లో బరిలోకి దిగుతోంది రాజస్థాన్ రాయల్స్. తొలి మ్యాచ్‌లోనే బలమైన పంజాబ్ కింగ్స్ వంటి జట్టుతో తలపడనుంది. బ్యాటింగ్‌లో బెన్ స్టోక్స్, జోస్ బట్లర్, స్టీవ్ స్మిత్, సంజు శాంసన్, ఆజింక్య రహానే, రాహుల్ తెవాటియా ఆటగాళ్లతో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: సరికొత్త కెప్టెన్‌తో ఈ ఏడాది ఐపీఎల్‌లో బరిలోకి దిగుతోంది రాజస్థాన్ రాయల్స్. తొలి మ్యాచ్‌లోనే బలమైన పంజాబ్ కింగ్స్ వంటి జట్టుతో తలపడనుంది. బ్యాటింగ్‌లో బెన్ స్టోక్స్, జోస్ బట్లర్, స్టీవ్ స్మిత్, సంజు శాంసన్, ఆజింక్య రహానే, రాహుల్ తెవాటియా ఆటగాళ్లతో బ్యాటింగ్ దూర్బేధ్యంగా కనిపిస్తున్నా బౌలింగ్‌లో జోఫ్రా ఆర్చర్ లేని లోటు కనిపిస్తోంది. ఆర్చర్ గతేడాది టోర్నీలో రాజస్థాన్‌కు ప్రధాన బౌలర్‌గా నిలిచాడు. టోర్నీ మొత్తంలో 20 వికెట్లు తీయడమే కాకుండా 113 రన్స్‌కూడా చేసి కీలక ఆటగాడిగా నిలిచాడు. కానీ ఈ ఏడాది గాయం కారణంగా జట్టుకు దూరమయ్యారు. దీంతో రాజస్థాన్ బౌలింగ్ విభాగం బలహీనపడింది. అయితే ఫిబ్రవరిలో జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో సౌత్‌ఆఫ్రికా బౌలింగ్ ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్‌ను ఏకంగా రూ.16 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. ఈ క్రమంలోనే అతడిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే ఆర్చర్ లేని లోటును మోరిస్ తీర్చగలడా..? అనే ప్రశ్న సర్వత్రా వినిపిస్తోంది. దీనిపై ఐపీఎల్ కామెంటేటర్లు సంజయ్ మంజ్రేకర్, డేల్ స్టెయిన్‌లు కూడా ప్రత్యేకంగా చర్చించారు. 


సౌత్ ఆఫ్రికా పేసర్ స్టెయిన్ మాట్లాడుతూ.. మోరిస్ కచ్చితంగా ఆర్చర్ లోటును తీర్చగలడని, అతడి ఎకానమీ చూస్తేనే ఆ విషయం అర్థమవుతుందని అన్నాడు. గత సీజన్లో 9 మ్యాచ్‌లు ఆడిన మోరిస్.. 6.63 ఎకానమీతో 11 వికెట్లు తీశాడని స్టెయిన్ అన్నాడు. మంజ్రేకర్ కూడా ఈ స్టెయిన్ అభిప్రాయంతో ఏకీభవించాడు. గతేడాది ప్రారంభంలో మోరిస్ కొన్ని మ్యాచ్‌లు ఆడలేకపోయినా.. ఆ తరువాత జట్టులోకొచ్చి అద్భుతమైన ప్రదర్శన చేశాడని, ఈ ఏడాది కూడా అలాంటి ప్రదర్శనే చేస్తాడని అనుకుంటున్నానని మంజ్రేకర్ అభిప్రాపడ్డాడు. మరి వీరందరి అంచనాలను మోరిస్ ఏ స్థాయిలో అందుకుంటాడో చూడాలి.

Updated Date - 2021-04-13T00:30:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising