ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ముంగిట కొవిడ్‌ కలకలం

ABN, First Publish Date - 2021-01-17T09:26:01+05:30

ఈ ఏడాది తొలి గ్రాండ్‌స్లామ్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ సన్నాహకాల వేళ కరోనా కేసులు వెలుగుచూడడం కలకలం సృష్టించింది. వచ్చేనెల ఎనిమిదినుంచి ఇక్కడ జరిగే టోర్నీకి ఆటగాళ్లు, కోచ్‌లు, అధికారుల రాక శనివారం ప్రారంభమైంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • కఠిన క్వారంటైన్‌లో ఆటగాళ్లు


మెల్‌బోర్న్‌: ఈ ఏడాది తొలి గ్రాండ్‌స్లామ్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ సన్నాహకాల వేళ కరోనా కేసులు వెలుగుచూడడం కలకలం సృష్టించింది. వచ్చేనెల ఎనిమిదినుంచి ఇక్కడ జరిగే టోర్నీకి ఆటగాళ్లు, కోచ్‌లు, అధికారుల రాక శనివారం ప్రారంభమైంది. తొలుత లాస్‌ఏంజెల్స్‌ నుంచి వచ్చిన విమానంలో రెండు కొవిడ్‌ కేసులు బయటపడ్టాయి. వీరిలో ఒకరు విమాన సిబ్బందికాగా మరొకరు సాధారణ ప్యాసింజర్‌గా ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ డైరెక్టర్‌ క్రెయిగ్‌ టిలే వెల్లడించారు. ఇక అబుధాబి నుంచి వచ్చిన రెండో విమానంలో ఒకరు పాజిటివ్‌గా తేలినా, వారు ప్లేయర్‌ కాదని టిలే తెలిపారు. మొత్తంగా రెండు విమానాల్లో వచ్చిన  47 మంది ఆటగాళ్లు 14 రోజులు కఠిన క్వారంటైన్‌లో ఉండాలని ఆరోగ్య శాఖ అధికారులు సూచించారు. వారిని ప్రాక్టీస్‌కు కూడా అనుమతించబోమన్నారు. 


స్టార్లు అడిలైడ్‌లో...

స్టార్‌ ఆటగాళ్లు జొకోవిచ్‌, నడాల్‌, సెరెనా విలియమ్స్‌, ఒసాక తదితరులకు అడిలైడ్‌లో బస కల్పించారు. వీరంతా అక్కడకు చేరుకొని తమకు కేటాయించిన హోటళ్లకు వెళ్లిపోయారు. 


Updated Date - 2021-01-17T09:26:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising