ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేను రిటైర్‌ కాలేదు: వెస్టిండీస్‌ స్టార్‌ క్రిస్‌ గేల్‌

ABN, First Publish Date - 2021-11-07T08:27:25+05:30

వెస్టిండీస్‌ వెటరన్‌ బ్యాటర్‌, ‘యూనివర్స్‌ బాస్‌’ క్రిస్‌ గేల్‌.. చివరి వరల్డ్‌కప్‌ ఆడేసినట్టే! ఆస్ట్రేలియాతో మ్యాచ్‌ సందర్భంగా 42 ఏళ్ల గేల్‌ ప్రవర్తించిన తీరుతో.. అతడు కెరీర్‌కు రిటైర్మెంట్‌ ప్రకటిస్తాడని అందరూ భావించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సొంతగడ్డపై వీడ్కోలు చెప్పాలనుకుంటున్నా


అబుధాబి: వెస్టిండీస్‌ వెటరన్‌ బ్యాటర్‌, ‘యూనివర్స్‌ బాస్‌’ క్రిస్‌ గేల్‌.. చివరి వరల్డ్‌కప్‌ ఆడేసినట్టే! ఆస్ట్రేలియాతో మ్యాచ్‌ సందర్భంగా 42 ఏళ్ల గేల్‌ ప్రవర్తించిన తీరుతో.. అతడు కెరీర్‌కు రిటైర్మెంట్‌ ప్రకటిస్తాడని అందరూ భావించారు. అయితే, తాను కెరీర్‌కు వీడ్కోలు పలకలేదని.. స్వదేశంలో సొంత ప్రేక్షకుల సమక్షంలో గుడ్‌బై ప్రకటించాలనుకుంటున్నట్టు గేల్‌ స్వయంగా తెలిపాడు. కానీ, ఒకరకంగా ఆటకు వీడ్కోలు పలికినట్టేనని అన్నాడు. ‘వరల్డ్‌కప్‌ చివరి మ్యాచ్‌ కావడంతో ప్రేక్షకులతో సరదాగా వ్యవహరించా. మరో ప్రపంచకప్‌ ఆడాలనుంది. కానీ, బోర్డు అవకాశం ఇస్తుందనైతే అనుకోవడం లేదు. నేనైతే రిటైర్మెంట్‌ ప్రకటించలేదు. కానీ, జమైకాలో వీడ్కోలు మ్యాచ్‌కు బోర్డు అవకాశం ఇవ్వాలి.


సొంత ప్రేక్షకుల ముందు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాలనుకుంటున్నా. ఒకవేళ అలా జరగకపోతే అప్పుడు నిర్ణయాన్ని ప్రకటిస్తా’ అని ఫేస్‌బుక్‌ లైవ్‌లో గేల్‌ చెప్పాడు. ఆసీస్‌తో మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన గేల్‌ 15 పరుగులు చేసి కమిన్స్‌ బౌలింగ్‌లో అవుటయ్యాడు. పిచ్‌ను వీడుతున్నప్పుడు ఇక వీడ్కోలు అన్నట్టుగా బ్యాట్‌ను మైదానంలోని ప్రేక్షకులు, కెమెరాకు చూపిస్తూ బయటకు రాగా.. సహ చరులంతా బౌండ్రీ రోప్‌ వద్ద నిల్చొని అతనికి గౌరవంగా స్వాగతం పలికారు. మ్యాచ్‌ ముగిసిన తర్వాత ఆసీస్‌  ఆటగాళ్లు.. గేల్‌, రిటైర్మెంట్‌ ప్రకటించిన బ్రావోకు గార్డ్‌ ఆఫ్‌ ఆనర్‌ ఇచ్చారు. ‘విండీస్‌ జెర్సీలో గేల్‌ను చూడడం ఇదే చివరిసారి’ అని కామెంటేటర్‌ ఇయాన్‌ బిషప్‌ వ్యాఖ్యానించాడు. 

Updated Date - 2021-11-07T08:27:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising