ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tokyo Olympics: మళ్లీ అగ్రస్థానానికి చైనా..

ABN, First Publish Date - 2021-07-30T06:50:56+05:30

టోక్యో ఒలింపిక్స్‌లో చైనా మళ్లీ అగ్రస్థానానికి చేరింది. జపాన్‌ను వెనక్కి నెట్టి టాప్ ప్లేస్ కైవసం చేసుకుంది. మొత్తంగా 15 బంగారు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టోక్యో ఒలింపిక్స్‌లో చైనా మళ్లీ అగ్రస్థానానికి చేరింది. జపాన్‌ను వెనక్కి నెట్టి టాప్ ప్లేస్ కైవసం చేసుకుంది. మొత్తంగా 15 బంగారు పతకాలు, 7 రజత పతకాలు, 9 కాంస్య పతకాలతో మొత్తం 31 పతకాలు సాధించిన చైనా ఒలింపిక్ పతకాల పట్టికలో నెంబర్ వన్ ర్యాంకును కైవసం చేసుకుంది. ఇక జపాన్ కూడా 15 గోల్డ్ మెడల్స్ సాధించినా.. సిల్వర్ మెడల్స్ 4 మాత్రమే సాధించడం, బ్రాంజ్ మెడల్స్ 6 మాత్రమే దక్కించుకోవడంతో మొత్తంగా 25 మెడల్స్‌తో రెండో స్థానానికి పడిపోయింది. ఇక మూడో స్థానంలో అమెరికా 14 పసిరి పతకాలే గెలిచినా.. రజత, కాంస్య పతకాల్లో మాత్రం వరుసగా 14, 10 పతకాలతో దూసుకుపోతోంది. మొత్తంగా 38 పతకాలు తన ఖాతాలో వేసుకుంది.


ఇదిలా ఉంటే భారత్ మాత్రం ఇప్పటివరకు కేవలం ఒకే ఒక్క రజత పతకం సాధించి 46వ స్థానానికి పడిపోయింది. భారత్‌తో పాటు బల్గేరియా, కొలంబియా, జోర్డాన్, నార్త్ మెసిడోనియా, పోలాండ్, టర్క్‌మెనిస్తాన్, వెనిజులా దేశాలు కూడా ఒకే ఒక్క రజత పతకాలు సాధించి 46వ స్థానంలో ఉన్నాయి.

Updated Date - 2021-07-30T06:50:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising