ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంజాబ్‌ను చిత్తు.. 16 ఓవర్లలోనే చెన్నై విన్

ABN, First Publish Date - 2021-04-17T04:16:04+05:30

పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ అద్భుత విజయం సాధించింది. తొలుత చెన్నై బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చయడంతో పంజాబ్ 8 వికెట్లకు 106 పరుగులతో ఈ సీజన్లోనే అత్యంత తక్కువ స్కోరు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ అద్భుత విజయం సాధించింది. తొలుత చెన్నై బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చయడంతో పంజాబ్ 8 వికెట్లకు 106 పరుగులతో ఈ సీజన్లోనే అత్యంత తక్కువ స్కోరు నమోదు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన చెన్నై కేవలం రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని 15.4 ఓవర్లలో ఛేదించింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(5) వెంటనే అవుటైనా.. మరో ఓపెనర్ ఫాఫ్ డూ ప్లెసిస్(33 నాటౌట్: 28 బంతుల్లో.. 3 ఫోర్లు, 1 సిక్స్), మొయీన్ అలీ(46: 31 బంతుల్లో.. 7 ఫోర్లు, 1 సిక్స్) చివరి వరకు క్రీజులో పాతుకుపోయి చెన్నైకి విజయాన్ని కట్టబెట్టాడు.




 విజయానికి మరో 17 పరుగులు కావల్సి ఉండగా.. మొయీన్ అలీ అవుట్ కాగా.. ఆ తర్వాత వచ్చిన సురేశ్ రైనా(8: 9 బంతుల్లో.. 1 ఫోర్), అంబటి రాయుడు(0) వెంటవెంటనే పెవిలియన్ చేరారు. కానీ శామ్ కర్రాన్(5 నాటౌట్: 4 బంతుల్లో.. 1 ఫోర్)తో కలిసి డూ ప్లెసిస్ లాంఛనం పూర్తి చేశాడు. ఈ విజయంతో చెన్నై.. ఐపీఎల్ 14వ సీజన్లో పాయింట్ల ఖాతా తెరిచింది. ఇక పంజాబ్ బౌలర్లలో మహ్మద్ షమి 2 వికెట్లు తీయగా, అర్షదీప్ సింగ్, మురుగన్ అశ్విన్ చెరో వికెట్ దక్కాయి. కాగా.. చెన్నై బౌలర్లలో 4 వికెట్లతో రాణించిన దీపక్ చాహర్‌కు మ్యాచ్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

Updated Date - 2021-04-17T04:16:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising