ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Team Indiaను వీడని కరోనా.. చాహల్, గౌతమ్‌కు పాజిటివ్

ABN, First Publish Date - 2021-07-30T23:03:12+05:30

శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో ఓడిన టీమిండియాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. స్పిన్నర్లు యుజ్వేంద్ర చాహల్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొలంబో: శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో ఓడిన టీమిండియాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. స్పిన్నర్లు యుజ్వేంద్ర చాహల్, కృష్ణప్ప గౌతమ్ కరోనా బారినపడ్డారు. మూడు రోజుల క్రితం కృనాల్ పాండ్యాకు పాజిటివ్‌గా నిర్ధారణ కాగా, తాజాగా వీరిద్దరికీ కరోనా సంక్రమించినట్టు నిర్ధారణ అయింది. కృనాల్ పాండ్యా కరోనా బారినపడడం, అతడితో సన్నిహితంగా మరికొందరిని క్వారంటైన్‌కు పంపడంతో చివరి రెండు టీ20ల్లో 9 మంది బెస్ట్ ప్లేయర్లు లేకుండానే భారత జట్టు బరిలోకి దిగి భంగపడింది. చాహల్, గౌతమ్‌లకు కరోనా సోకినప్పటికీ వారిలో ఎలాంటి లక్షణాలు లేవని బోర్డు తెలిపింది.


నిజానికి ఈ సిరీస్‌కు తొలి నుంచీ కరోనా అడ్డుపడుతూనే ఉంది. తొలుత శ్రీలంక జట్టు సిబ్బంది వైరస్ బారినపడడంతో సిరీస్ 5 రోజులు వాయిదా పడింది. ఆ తర్వాత రెండో టీ20కి ముందు కృనాల్ పాండ్యాకు కరోనా సోకడంతో మ్యాచ్‌ను తర్వాతి రోజుకు మార్చారు. మరోవైపు, ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత టెస్టు  జట్టులో వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్ కూడా కరోనా బారినపడి కోలుకున్నాడు. అలాగే, వృద్ధిమాన్ సాహా, అభిమన్యు ఈశ్వరన్, భరత్ అరుణ్ కూడా వైరస్ బారినపడి కోలుకున్నారు. 

Updated Date - 2021-07-30T23:03:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising