ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బుమ్రా, ఉమేష్‌ ఇన్‌?

ABN, First Publish Date - 2021-02-23T09:17:24+05:30

మొతేరా స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరుగనున్న మూడో టెస్ట్‌ వరల్డ్‌ చాంపియన్‌షి్‌ప ఫైనల్‌ కోణంలోంచి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 సిరాజ్‌, కుల్దీప్‌ అవుట్‌?


అహ్మదాబాద్‌: మొతేరా స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరుగనున్న మూడో టెస్ట్‌ వరల్డ్‌ చాంపియన్‌షి్‌ప ఫైనల్‌ కోణంలోంచి చూస్తే కోహ్లీ సేనకు అత్యంత కీలకం. ఈ నేపథ్యంలో బ్యాటింగ్‌ లైన్‌పను టీమిండియా యథాతథంగా కొనసాగించనుండగా.. బౌలింగ్‌లో మార్పులు తప్పకపోవచ్చు. పేసర్లు బుమ్రాతో పాటు ఫిట్‌నెస్‌ నిరూపించుకున్న ఉమేష్‌ యాదవ్‌ తుది జట్టులోకి రానుండగా.. సిరాజ్‌, కుల్దీప్‌ను బెంచ్‌కే పరిమితం చేసే చాన్సులున్నాయి. స్పిన్‌ ఆల్‌రౌండర్లుగా అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌తోపాటు ఇషాంత్‌కు ఢోకా లేదనిపిస్తోంది.


పిచ్‌ స్పిన్నర్లకు సహకరించే అవకాశం ఉన్నా.. పింక్‌ బాల్‌ కావడంతో సంధ్యా సమయం, మంచు ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకొని తుది జట్టును ఖరారు చేయాలని మేనేజ్‌మెంట్‌ యోచిస్తోంది.ఇంగ్లండ్‌ పేసర్లు అండర్సన్‌, ఆర్చర్‌ను గ్రీన్‌ వికెట్‌పై ఎదుర్కొన్న అనుభవం టీమిండియాకు లేదనే విషయాన్ని గుర్తించాలి. మంచు కారణంగా బంతిపై స్పిన్నర్లకు గ్రిప్‌ సరిగా చిక్కదనే కారణంతో పాటు బ్యాటింగ్‌ చేయలేని కుల్దీ్‌పను పక్కనపెట్టే అవకాశముంది. మూడో సీమర్‌గా సిరాజ్‌ కంటే ఎంతో అనుభవం, పేస్‌తో బౌలింగ్‌ చేయగల ఉమే్‌షవైపే మేనేజ్‌మెంట్‌ మొగ్గు చూపొచ్చు.

Updated Date - 2021-02-23T09:17:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising