ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫైనల్‌కు పేస్‌, బౌన్సీ పిచ్‌

ABN, First Publish Date - 2021-06-15T09:18:37+05:30

డబ్ల్యూటీసీ ఫైనల్‌ పిచ్‌ పేస్‌, బౌన్స్‌తోపాటు స్పిన్నర్లకు అనుకూలించేలా తయారు చేస్తున్నారు. భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య మ్యాచ్‌ ఈనెల 18న ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సౌతాంప్టన్‌ : డబ్ల్యూటీసీ ఫైనల్‌ పిచ్‌ పేస్‌, బౌన్స్‌తోపాటు స్పిన్నర్లకు అనుకూలించేలా తయారు చేస్తున్నారు. భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య మ్యాచ్‌ ఈనెల 18న ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ‘తటస్థ వేదిక, ఐసీసీ మార్గదర్శకాలు. దాంతో చక్కని పిచ్‌ తయారు చేస్తున్నాం. పోటీ రంజుగా ఉంటుంది. పేస్‌, బౌన్స్‌తోపాటు స్పిన్నర్లకు కూడా తోడ్పడేలా రూపొందించనున్నాం’ అని సౌతాంప్టన్‌ గ్రౌండ్‌ హెడ్‌ క్యూరేటర్‌ సైమన్‌ లీ తెలిపాడు. 


ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో భారత్‌?

ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో కోహ్లీసేన బరిలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. ఈమేరకు కెప్టెన్‌ విరాట్‌, కోచ్‌ రవిశాస్త్రి తుది జట్టును దాదాపు ఖరారు చేసినట్టు సమాచారం. పేసర్లకు సంబంధించి..బుమ్రా, షమిలతో పాటు మూడో బౌలర్‌గా ఇషాంత్‌, సిరాజ్‌, శార్దూల్‌లో ఎవరికి చాన్స్‌ దక్కుతుందో చూడాలి. మ్యాచ్‌ చివరి రోజు వికెట్‌ స్పిన్‌కు సహకరిస్తుందనే అంచనాతో..జడేజా, అశ్విన్‌తో  ఆడే అవకాశముంది. వీరిద్దరితో బ్యాటింగ్‌ విభాగం మరింత బలోపేతం కానుంది. అయితే మ్యాచ్‌ నాటికి ఉండే పరిస్థితులను బట్టి ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్ల కూర్పులో మార్పులుండే అవకాశముంది. సౌతాంప్టన్‌లో వర్షంపడే సూచనలుంటే నాలుగో సీమర్‌ను తీసుకొనే చాన్సుంది. ఆ పరిస్థితుల్లో బుమ్రా, షమి, ఇషాంత్‌, సిరాజ్‌, అశ్విన్‌లతో బరిలోకి దిగొచ్చు.  

Updated Date - 2021-06-15T09:18:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising