ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బయో బబుల్ ఎలా బ్రేక్ అయిందో తెలియడం లేదు: గంగూలీ

ABN, First Publish Date - 2021-05-06T21:17:53+05:30

ఐపీఎల్ బయోబబుల్ ఎందుకు బలహీనంగా మారిందో అర్థం కావడం లేదని, బహుశా ప్రయాణాలే కారణం కావొచ్చని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐపీఎల్ బయోబబుల్ ఎందుకు బలహీనంగా మారిందో అర్థం కావడం లేదని, బహుశా ప్రయాణాలే కారణం కావొచ్చని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్‌ అర్ధంతరంగా ముగిసిన నేపథ్యంలో సౌరవ్ గంగూలీ తాజాగా ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడాడు. ఐపీఎల్ నిర్వహించాలనుకున్నప్పుడు పరిస్థితులు సాధారణంగానే ఉన్నాయని పేర్కొన్నాడు. 


`బయో బబుల్ ఇలా బలహీనంగా ఎందుకు మారిందో తెలియడం లేదు. బహుశా ప్రయాణాలు ఒక కారణం కావొచ్చు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఐపీఎల్ నిర్వహించాలని మేం అనుకున్నప్పుడు కోవిడ్ విజృంభణ ఈ స్థాయిలో లేదు. ఇప్పుడు ఎవరు ఎన్నైనా చెబుతారు. కానీ, మేం మొదలుపెట్టినపుడు ఎవరూ అభ్యంతరం చెప్పలేద`ని గంగూలీ అన్నాడు. ఐసీసీ టీ-20 ప్రపంచకప్‌ను దుబాయ్‌లో నిర్వహించబోతున్నారనే వార్తల గురించి స్పందిస్తూ.. `దాని గురించి ఇప్పుడే మాట్లాడడం కష్టం. ఇంకా చాలా సమయం ఉంది. ఐసీసీ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మాత్రం ఇంగ్లండ్‌లో అనుకున్న విధంగానే జరుగుతుంది. భారత ఆటగాళ్లు ఇంగ్లండ్‌లో వారం రోజులు క్వారంటైన్‌లో ఉండి మ్యాచ్ ఆడతార`ని గంగూలీ స్పష్టం చేశాడు. 

Updated Date - 2021-05-06T21:17:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising