ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టెస్టు క్రికెట్‌కు బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ మహముదుల్లా గుడ్ బై

ABN, First Publish Date - 2021-07-10T14:31:51+05:30

బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ మహముదుల్లా టెస్టు క్రికెట్ కు గుడ్ బై చెప్పారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 రిటైర్ అవుతున్నట్లు ప్రకటన... ఆకస్మిక నిర్ణయం

న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ మహముదుల్లా టెస్టు క్రికెట్ కు గుడ్ బై చెప్పారు. హరారేలో జింబాబ్వేతో జరిగిన వన్ ఆఫ్ టెస్ట్ మ్యాచ్ మూడవ రోజు టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ కావాలని మహముదుల్లా ఆకస్మిక నిర్ణయం తీసుకున్నారు.మహముదుల్లా ప్రకటనతో  అతని సహచరులు, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు సభ్యులు షాక్ కు గురయ్యారు. తన 50వ టెస్టు మ్యాచ్ లో మహముదుల్లా తొలి ఇన్నింగ్స్ లో అజేయంగా 150 పరుగులు చేశారు. మ్యాచ్ ముగియకుండానే రిటైర్ మెంట్ ప్రకటించడం అసాధారణమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు నజ్ముల్ హసన్ చెప్పారు. 


రిటైర్మెంటు ప్రకటన జట్టుపై ప్రతికూల ప్రభావం చూపుతుందని, ఇది ఆమోదయోగ్యం కాదని హసన్ పేర్కొన్నారు. ‘‘ఎవరైనా క్రీడాకారులు ఆడటానికి ఇష్టం లేకపోతే సమస్య లేదని, కాని సిరీస్ మధ్యలో గందరగోళం సృష్టించాల్సిన అవసరం లేదు’’అని హసన్ వ్యాఖ్యానించారు. మహముదుల్లా ఇప్పటివరకు 50 టెస్టుల్లో 31.77 సగటుతో బంగ్లాదేశ్ తరఫున 2914 పరుగులు చేశాడు. 5 సెంచరీలు, 16 హాఫ్ సెంచరీలు చేసి 43 వికెట్లు తీశాడు.


Updated Date - 2021-07-10T14:31:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising