ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TokyoParalympics: బ్యాడ్మింటన్‌లో కృష్ణా నాగర్‌కు స్వర్ణం

ABN, First Publish Date - 2021-09-05T16:01:56+05:30

టోక్యో పారా ఒలింపిక్స్‌లో భారత ఆటగాడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టోక్యో: టోక్యో పారా ఒలింపిక్స్‌లో భారత ఆటగాడు కృష్ణా నాగర్‌ బంగారు పతకం దక్కించుకుని, చరిత్ర సృష్టించారు. ఫైనల్ మ్యాచ్‌లో కృష్ణా నాగర్‌ 2-1 స్కోరుతో హాంకాంగ్ ఆటగాడు కై మాన్ చును ఓడించారు. దీనికిముందు టోక్యో పారా ఒలింపిక్స్‌లో పురుషుల సింగిల్స్ బ్యాడ్మింటన్ ఈవెంట్-4 లో నోయిడా(యూపీ)లోని గౌతమ్ బుద్ధ్ నగర్‌ జిల్లా మేజిస్ట్రేట్ సుహాస్ యతిరాజ్ రజత పతకం సాధించారు. 


కాగా బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్-4 కాంస్య పతకం మ్యాచ్‌లో భారత ఆటగాడు తరుణ్ ధిల్లాన్ ఓటమి పాలయ్యారు. 2-0 తేడాతో ఇండోనేషియాకు చెందిన ఫ్రెడ్డీ సెటివాన్ చేతిలో ఓటమి పాలయ్యారు. షూటింగ్ ఈవెంట్‌లో సిద్ధార్థ్ బాబు, దీపక్ సైనీ, అవనీ లేఖారా టీమ్ నిరాశపరిచింది. 50 మీటర్ల ఎయిర్ రైఫిల్ ప్రోన్ ఎస్‌హెచ్ -1 ఫైనల్‌కు భారత జట్టు అర్హత సాధించలేకపోయింది. ఈ ఈవెంట్‌లో, అవనీ చివరి స్కోరు 612 ర్యాంక్ 28, సిద్ధార్థ్ బాబు చివరి స్కోరు 617.2 ర్యాంక్ 9. దీపక్ సైనీ చివరి స్కోరు 602.2, 46 వ ర్యాంక్. ఈవెంట్‌లో అర్హత సాధించేందుకు ఈ ర్యాంకు సరిపోకపోవడంతో వీరంతా నిరాశగా వెనుదిరగాల్సివచ్చింది.

Updated Date - 2021-09-05T16:01:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising