ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇళ్లకు చేరిన ఆస్ట్రేలియా క్రికెటర్లు!

ABN, First Publish Date - 2021-05-17T22:39:34+05:30

ఎంతో నిరీక్షణ, హైడ్రామా తర్వాత ఆస్ట్రేలియా క్రికెటర్లు ఎట్టకేలకు ఈ రోజు (సోమవారం) స్వదేశానికి చేరుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎంతో నిరీక్షణ, హైడ్రామా తర్వాత ఆస్ట్రేలియా క్రికెటర్లు ఎట్టకేలకు ఈ రోజు (సోమవారం) స్వదేశానికి చేరుకున్నారు. భారత్‌లో కరోనా సెకెండ్‌ వేవ్‌ కారణంగా ఐపీఎల్‌ నిరవధికంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. దీంతో ఆటగాళ్లందరూ వారి వారి స్వదేశాలకు పయనమయ్యారు. అయితే భారత్ నుంచి విమాన ప్రయాణాలను ఆస్ట్రేలియా ప్రభుత్వం నిషేధించిన నేపథ్యంలో ఆసీస్ క్రికెటర్లు నేరుగా ఇళ్లకు వెళ్లడం కుదరలేదు. 


భారత్ నుంచి మాల్దీవులకు చేరుకుని అక్కడ రెండు వారాల పాటు క్వారంటైన్‌లో ఉన్నారు. అక్కడి నుంచి  ప్రత్యేక విమానంలో సోమవారం ఉదయం సిడ్నీ చేరుకున్నారు. 38 మంది ఆసీస్‌ ఆటగాళ్లు సహా కోచింగ్‌ స్టాఫ్‌ ఆస్ట్రేలియాలో ల్యాండ్‌ అయ్యారని అక్కడి మీడియా తెలిపింది.  విమానాశ్రయం నుంచి నేరుగా సిడ్నీలోని ఓ హాటల్‌కి వెళ్లి అక్కడ 14 రోజుల పాటు వీరందరూ క్వారంటైన్‌లో ఉండనున్నారు. కరోనా బారిన పడిన ఆసీస్‌ మాజీ ఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్‌ హెడ్‌ కోచ్‌ మైక్‌ హస్సీ పూర్తిగా కోలుకోవడంతో స్వదేశానికి చేరుకోనున్నాడు. 

Updated Date - 2021-05-17T22:39:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising