ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆస్ట్రేలియా సూపర్ విక్టరీ.. విండీస్ ఇంటికి

ABN, First Publish Date - 2021-11-07T00:47:56+05:30

టీ20 ప్రపంచకప్ సూపర్ 12 గ్రూప్ 1‌ను ఆస్ట్రేలియా విజయవంతంగా ముగించింది. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అబుదాబి: టీ20 ప్రపంచకప్ సూపర్ 12 గ్రూప్ 1‌ను ఆస్ట్రేలియా విజయవంతంగా ముగించింది. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో సూపర్ విక్టరీ సాధించి గ్రూప్ 1లో రెండో స్థానంలో నిలిచింది. ఆడిన ఐదు మ్యాచుల్లో నాలుగింటిలో ఓడిన వెస్టిండీస్ టోర్నీ నుంచి నిష్కృమించింది.


విండీస్ నిర్దేశించిన 158 పరుగుల విజయ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 16.2 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ 56 బంతుల్లో 9 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో అజేయంగా 89 పరుగులు చేయగా, మిచెల్ మార్ష్ 32 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 53 పరుగులు చేసి జట్టుకు అపూర్వ విజయాన్ని అందించారు. బ్యాట్‌తో అదరగొట్టిన వార్నర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.


అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో7 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. లూయిస్ 29, హెట్‌మయర్ 24, కెప్టెన్ కీరన్ పొలార్డ్ 44 పరుగులు చేయగా, కెరియర్‌లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన బ్రావో 10 పరుగులు మాత్రమే చేశాడు.

Updated Date - 2021-11-07T00:47:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising