ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియోకు హనుమ విహారి షాక్

ABN, First Publish Date - 2021-01-14T03:50:20+05:30

కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియోకు హనుమ విహారి షాక్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియోకు టీం ఇండియా క్రికెటర్ హనుమ విహారి షాకిచ్చాడు. మంత్రి సుప్రియో తనపై చేసిన ట్వీట్‌లో ఓ తప్పును విహారి గమనించాడు. ఆయన తన పేరును పొరబాటున ‘బిహారి’ అని రాయడాన్ని చూసి.. 'హనుమ విహారి' అని మంత్రికి రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం ఈ రిప్లై సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. విహారి రిప్లై అదిరిపోయిందని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.


ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో హనుమ విహారి ఆటపై మంత్రి ఈ విధంగా కామెంట్స్ చేశారు. 7 పరుగులు చేసేందుకు 109 బంతులు ఆడడం నేరమని, టీం ఇండియా చారిత్రక గెలుపును హనుమ బిహారి చంపేయడమే కాదు, క్రికెట్‌ను హత్య చేశాడని కేంద్ర మంత్రి సుప్రియో సంచలన వ్యాఖ్యలు చేశారు. గెలుపు అవకాశాలను నిలబెట్టలేని అతను ఒక నేరస్థుడంటూ సంచలన కామెంట్స్ చేశారు. క్రికెట్ గురించి నాకు ఏమీ తెలియదని, ఆ విషయం తనకు కూడా తెలుసని అంటూనే బాబుల్ సుప్రియో.. విహారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

Updated Date - 2021-01-14T03:50:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising