ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బ్రిస్బేన్ టెస్ట్.. టీమిండియా ఆలౌట్

ABN, First Publish Date - 2021-01-17T18:09:36+05:30

గబ్బా వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్ తొలి ఇన్నింగ్సులో టీమిండియా ఆలౌట్ అయ్యింది. 111.4 ఓవర్లలో 336 పరుగులు చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బ్రిస్బేన్: గబ్బా వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్ తొలి ఇన్నింగ్సులో టీమిండియా ఆలౌట్ అయ్యింది. 111.4 ఓవర్లలో 336 పరుగులు చేసింది. ఆసీస్ 33 పరుగుల ఆధిక్యం సాధించింది. పదో వికెట్‌గా సిరాజ్(13) పెవిలియన్ బాట పట్టాడు. హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆసీస్ బౌలర్లలో హాజిల్‌వుడ్ ఐదు వికెట్లు తీసుకున్నాడు. ఇక స్టార్క్, కమ్మిన్స్ చెరో రెండు వికెట్లు, లియాన్ ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.  


అంతకుముందు, 62/2 స్కోర్ దగ్గర మూడో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా.. 186 పరుగులకు 6 వికెట్లు కోల్పోయింది. చతేశ్వర్ పుజారా(25), ఆజింక్య రహానే(37), మయాంక్ అగర్వాల్(38), రిషబ్ పంత్(23) అవుట్ అయ్యారు. అయితే టీమిండియా బౌలర్లు సుందర్-శార్దుల్ జోడీ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడింది. ఈ ఇద్దరూ సెంచరీ భాగస్వామ్యంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఈ ఇద్దరి జోరుకు జట్టు స్కోర్ 309 పరుగుల దగ్గర బ్రేక్ పడింది. 103వ ఓవర్ మూడో బంతికి కమిన్స్ బౌలింగ్‌లో శార్దుల్(67) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన సైని.. హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో స్మిత్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఇక 62 పరుగుల వ్యక్తిగత స్కోర్ దగ్గర స్టార్క్ బౌలింగ్‌లో గ్రీన్‌కు సుందర్ క్యాచ్ ఇచ్చాడు. దీంతో టీమిండియా 109 ఓవర్లలో 328 పరుగులకు 9 వికెట్లు కోల్పోయింది. జట్టు స్కోర్‌కు మరో ఎనిమిది పరుగులు జోడించిన తర్వాత సిరాజ్ పెవిలియన్ చేరాడు. దీంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్ ముగిసింది. 

Updated Date - 2021-01-17T18:09:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising