ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్చర్లకు ఆఖరి చాన్స్‌

ABN, First Publish Date - 2021-07-28T09:47:18+05:30

టోక్యో ఒలింపిక్స్‌లో ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన భారత ఆర్చర్లు టీమ్‌ ఈవెంట్లలో పూర్తిగా నిరాశపరిచారు. కచ్చితంగా పతకం సాధిస్తుందనుకున్న...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • నేడు వ్యక్తిగత ఈవెంట్‌ బరిలో దీపిక, ప్రవీణ్‌

టోక్యో ఒలింపిక్స్‌లో ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన భారత ఆర్చర్లు టీమ్‌ ఈవెంట్లలో పూర్తిగా నిరాశపరిచారు. కచ్చితంగా పతకం సాధిస్తుందనుకున్న స్టార్‌ ఆర్చర్‌ దీపికా కుమారి మిక్స్‌డ్‌ విభాగంలో ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. అనుభవజ్ఞులైన అతాను దాస్‌, తరుణ్‌దీప్‌ రాయ్‌ కూడా సమష్టిగా సత్తా చాటలేకపోయారు. ఇక, భారత ఆశలన్నీ వ్యక్తిగత ఈవెంట్లపైనే. బుధవారం జరిగే వ్యక్తిగత ఈవెంట్లలో దీపికా కుమారి, తరుణ్‌దీప్‌ రాయ్‌, ప్రవీణ్‌ జాదవ్‌ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. టోక్యోలో పతకం సాధించేందుకు భారత ఆర్చర్లకిదే చివరి అవకాశం. వరుసగా మూడోసారి విశ్వక్రీడల్లో తలపడుతున్న ప్రపంచ నెంబర్‌వన్‌ దీపిక తొలి రౌండ్లో భూటాన్‌కు చెందిన కర్మాతో తలపడనుంది. ఆరంభ రౌండ్లు అధిగమిస్తే క్వార్టర్స్‌లో కొరియా టాప్‌సీడ్‌ అన్‌ సాన్‌ను దీపిక ఎదుర్కోవాల్సి ఉంటుంది. మిక్స్‌డ్‌ విభాగంలో అన్‌ సాన్‌ చేతిలోనే ఓడిన నేపథ్యంలో దీపిక ఈమారు ఆచితూచి ఆడితేనే పతకం దక్కే చాన్సుంటుంది.  

Updated Date - 2021-07-28T09:47:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising