ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tokyo Olympics: అదరగొట్టిన అతాను దాస్.. ఒలింపిక్స్ స్వర్ణపతక విజేతకు షాక్!

ABN, First Publish Date - 2021-07-29T15:03:45+05:30

ఒలింపిక్స్ పురుషుల ఆర్చరీలో భారత టాప్ ఆర్చర్ అతాను దాస్‌ అదరగొట్టాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టోక్యో: ఒలింపిక్స్ పురుషుల ఆర్చరీలో భారత టాప్ ఆర్చర్ అతాను దాస్‌ అదరగొట్టాడు. గురువారం పురుషుల వ్యక్తిగత విభాగంలో జరిగిన 1/16 ఎలిమినేషన్‌ రౌండ్‌లో ఆయన  కొరియన్ ఆర్చర్‌ జిన్‌హెక్‌పై 6-5 తేడాతో సంచలన విజయం సాధించారు. దీంతో అతాను ప్రీక్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. జిన్‌ హెక్‌ 2012 లండన్‌ ఒలిపింక్స్‌లో గోల్డ్‌మెడలిస్ట్‌ కావడం విశేషం. అంతకుముందు అతాను దాస్ 1/32 ఎలిమినేషన్ రౌండ్‌లో చైనీస్‌ తైపీకి చెందిన యూ చెంగ్‌ డెంగ్‌పై 6-4 తేడాతో ఘన విజయం సాధించాడు. మరోవైపు ఒలింపిక్స్ ఆరో రోజు భారత్‌కు బాగానే కలిసి వచ్చింది. ఇవాళ పీవీ సింధు, పురుషుల హాకీ జట్టు మంచి విజయాలతో ముందంజ వేయగా.. ఇప్పుడు అర్చరీలో అతాను దాస్ ప్రీక్వార్టర్స్ చేరడంతో భారత్‌ మరిన్ని పతకాలకు చేరువవుతుందనే చెప్పాలి.   

Updated Date - 2021-07-29T15:03:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising