ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

16 ఏళ్లకే శతక్కొట్టింది

ABN, First Publish Date - 2021-10-12T06:35:39+05:30

ఐర్లాండ్‌కు చెందిన అమీ హంటర్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో పిన్న వయస్సులో సెంచరీ చేసిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐర్లండ్‌ బ్యాటర్‌ అమీ రికార్డు

హరారే: ఐర్లాండ్‌కు చెందిన అమీ హంటర్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో పిన్న వయస్సులో సెంచరీ చేసిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించింది. సోమవారం తన 16వ జన్మదినాన ఆమె ఈ ఘనత అందుకోవడం విశేషం.  జింబాబ్వే మహిళలతో మూడో వన్డేలో అమీ అజేయంగా 121 పరుగులు చేసింది. ఈ నేపథ్యంలో పురుషులు, మహిళల క్రికెట్‌లో చిన్న వయస్సులో శతకం సాధించిన ప్లేయర్‌గా రికార్డు పుటల్లో హంటర్‌ చోటు దక్కించుకుంది. పురుషులకు సంబంధించి పిన్న వయస్సులో సెంచరీ చేసిన రికార్డు పాక్‌ మాజీ క్రికెటర్‌ షాహిద్‌ అఫ్రిది (16 ఏళ్ల 217 రోజులు) పేరిట ఉంది. శ్రీలంకపై అతడు 102 రన్స్‌ సాధించాడు. ఇక మహిళల్లో రికార్డు భారత స్టార్‌ బ్యాటర్‌ మిథాలీ రాజ్‌ పేరిట ఉంది. 16 ఏళ్ల 205 రోజుల వయస్సులో ఐర్లాండ్‌పై మిథాలీ 144 నాటౌట్‌ స్కోరుతో రికార్డు నెలకొల్పింది. జింబాబ్వేతో మ్యాచ్‌లో ఐర్లాండ్‌ 85 పరుగులతో నెగ్గింది. ఐర్లాండ్‌ 312/3 స్కోరుకు జవాబుగా జింబాబ్వే 50 ఓవర్లలో 227/8 స్కోరుకే పరిమితమైంది. 

Updated Date - 2021-10-12T06:35:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising