ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆఫ్ఘాన్ అద్భుత విజయం

ABN, First Publish Date - 2021-10-26T05:06:07+05:30

టీ20 ప్రపంచకప్ 2021లో భాగంగా స్కాట్‌ల్యాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ అద్భుత విజయం సాధించింది. స్కాట్‌ల్యాండ్‌ను..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

షార్జా: టీ20 ప్రపంచకప్ 2021లో భాగంగా స్కాట్‌ల్యాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ అద్భుత విజయం సాధించింది. స్కాట్‌ల్యాండ్‌ను చిత్తుగా ఓడించి ఏకంగా 130 పరుగుల ఆధిక్యంతో విజయం దక్కించుకుంది. తొలుత టాస్ గెలిచిన ఆఫ్ఘాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు హజ్రతుల్లా జజాయ్(44: 30 బంతుల్లో, 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), మహమ్మద్ షెహజాద్(22: 15 బంతుల్లో, 2 ఫోర్లు, 1 సిక్స్) మంచి ఓపెనింగ్ ఇచ్చారు. ఆ తర్వాత వన్ డౌన్‌లో రహమానుల్లా గుర్బజ్(46: 37 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్స్‌లు) రాణంచగా.. ఆ తర్వాత నజీబుల్లా జద్రాన్(59: 34 బంతుల్లో, 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్థసెంచరీతో అదరగొట్టాడు. దీంతో ఆఫ్ఘాన్ నిర్ణీత 20 ఓవర్లలో 190 పరుగుల భారీ స్కోరు చేసింది. అంతర్జాతీయ టీ20 చరిత్రలో ఆఫ్ఘాన్‌కు ఇదే అత్యధిక స్కోర్ కావడం విశేషం. స్కాట్‌ల్యాండ్ బౌలర్లలో సఫ్యాన్ షరిఫ్ 2 వికెట్లు తీయగా, జోష్ డేవీ, మార్క్ వ్యాట్ చెరో వికెట్ దక్కించుకున్నారు.


అనంతనం 191 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన స్కాట్‌ల్యాండ్‌కు ఆరంభం నుంచే తడబడింది. ఓపెనర్ జార్జ్ మున్సీ(25: 18 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) తప్ప మరే ఆటగాడు కూడా కనీస పరుగులు చేయలేకపోయారు. దీంతో స్కాట్‌ల్యాండ్ కేవలం 10.2 ఓవర్లలో 60 పరుగులకే కుప్పకూలింది. దీంతో అత్యధికంగా 130 పరుగుల భారీ తేడాతో ఆఫ్ఘనిస్తాన్ విజయం సాధించింది. ఆఫ్ఘన్ బౌలర్లలో ముజీబుర్ రెహ్మాన్ 5 వికెట్లు తీసి స్కాట్‌ల్యాండ్ వెన్ను విరిచాడు. అతడితో పాటు రషీద్ ఖాన్ 4 వికెట్లు, నవీన్ ఉల్ హక్ 1 వికెట్ తీశారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ముజీబుర్ రెహ్మాన్‌కు దక్కింది.

Updated Date - 2021-10-26T05:06:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising