ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tokyo Olympics: భారత గోల్ఫర్‌కు తృటిలో చేజారిన పతకం!

ABN, First Publish Date - 2021-08-07T16:37:45+05:30

ఒలింపిక్స్‌లో భారత గోల్ఫర్ అదితి అశోక్‌కు తృటిలో పతకం చేజారింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టోక్యో: ఒలింపిక్స్‌లో భారత గోల్ఫర్ అదితి అశోక్‌కు తృటిలో పతకం చేజారింది. చివరి వరకు రసవత్తరంగా సాగిన మహిళ విభాగం గోల్ఫ్‌ మ్యాచ్‌లో అదితి నాలుగో స్థానంలో నిలిచింది. ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన అదితి అంచనాలకు మించి రాణించింది. సంచలన ప్రదర్శనతో పతకానికి చేరువైంది. మూడో రౌండ్ ముగిసేరికి రెండో స్థానంలో ఉన్నా అదితి.. నాలుగో రౌండ్‌లో కొంత నిరాశపరిచింది. దాంతో నాలుగో స్థానానికి పరిమితమైంది. మొదటి స్థానంలో నిలిచిన అమెరికాకు చెందిన కొర్డా నెల్లి గోల్డ్ గెలిచింది. నమి నోమ్(జపాన్)- సిల్వర్, కో లాడియా(న్యూజిలాండ్)- కాంస్యం గెలిచారు. ఇదే ఈవెంట్‌లో పోటీ పడిన మరో భారత గోల్ఫర్ దగర్ దీక్ష 50వ స్థానంతో సరిపెట్టుకుంది. అయితే, ఒలింపిక్స్ చరిత్రలో ఇప్పటివరకు భారత్ నుంచి అత్యుత్తమ ప్రదర్శన అదితిదే. 2016 రియో ఒలింపిక్స్‌లో తొలిసారి బరిలోకి దిగిన అదితి 41వ స్థానానికి పరిమితమైంది. కానీ, టోక్యో ఒలింపిక్స్‌లో అద్భుతమైన ప్రదర్శనతో ఏకంగా నాలుగో స్థానంలో నిలవడం విశేషం. 


Updated Date - 2021-08-07T16:37:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising