ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Aaron Finch: ఆస్ట్రేలియాకు భారీ ఎదురుదెబ్బ

ABN, First Publish Date - 2021-07-26T00:56:37+05:30

వెస్టిండీస్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 1-4తో ఓడిన ఆస్ట్రేలియాకు మరో ఎదురుదెబ్బ తగిలింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిడ్నీ: వెస్టిండీస్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 1-4తో ఓడిన ఆస్ట్రేలియాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. బంగ్లాదేశ్ పర్యటనకు ముందు ఆ జట్టు వన్డే కెప్టెన్ అరోన్ ఫించ్ దూరమయ్యాడు. టీ20 ఫార్మాట్‌లో నిలకడగా ఆడుతున్న ఫించ్ జట్టుకు దూరం కావడం గొప్ప దెబ్బేనని చెబుతున్నారు. విండీస్‌తో జరిగిన చివరి టీ20లో ఫించ్ మోకాలికి గాయమైంది. దీంతో కరేబియన్లతో జరిగిన తొలి వన్డే సిరీస్‌కు  దూరమయ్యాడు. దీంతో అతడి స్థానంలో అలెక్స్ కేరీకి సారథ్య బాధ్యతలు అప్పగించారు. 


గాయపడిన ఫించ్ స్వదేశానికి తిరిగి బయలుదేరనున్నాడు. గాయం కారణంగా జట్టుకు దూరం కావడం తనను తీవ్రంగా బాధించిందని ఫించ్ చెప్పుకొచ్చాడు. గాయానికి అవసరమైతే సర్జరీ చేయించుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నాడు. త్వరలో టీ20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో కోలుకునేందుకు పూర్తిగా విశ్రాంతి తీసుకోనున్నట్టు చెప్పాడు.  

Updated Date - 2021-07-26T00:56:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising