ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోహిత్ అతడికి బౌలింగ్ ఎందుకివ్వలేదో అర్థం కావడం లేదు: ఆకాశ్ చోప్రా

ABN, First Publish Date - 2021-11-19T03:08:39+05:30

మూడు మ్యాచ్‌ల టీ20లో భాగంగా బుధవారం న్యూజిలాండ్‌-భారత్ మధ్య జరిగిన మ్యాచ్‌ను తన యూట్యూబ్ చానల్‌లో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా బుధవారం న్యూజిలాండ్‌-భారత్ మధ్య జరిగిన మ్యాచ్‌ను తన యూట్యూబ్ చానల్‌లో విశ్లేషించిన టీమిండియా మాజీ క్రెకెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా.. కెప్టెన్‌గా రోహిత్ శర్మ అరుదైన తప్పిదం చేశాడని పేర్కొన్నాడు.


జట్టులో ఆరో బౌలర్ ఉండాలని వెంకటేశ్ అయ్యర్‌ను తుది జట్టులోకి తీసుకున్నారని, కానీ అతడికి బౌలింగ్ చేసే అవకాశం మాత్రం ఇవ్వలేని అన్నాడు. నిజానికి రోహిత్ శర్మ కెప్టెన్సీ బాగుంటుందని, కానీ వెంకటేశ్ అయ్యర్‌కు బౌలింగ్ ఎందుకు ఇవ్వలేదో తనకు అర్థం కావడం లేదని అన్నాడు.


న్యూజిలాండ్ జట్టు తొలి ఓవర్‌లోనే వికెట్ కోల్పోయిన వేళ వెంకటేశ్ అయ్యర్‌తో రెండుమూడు ఓవర్లు వేయించి ఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు. దీపక్ చాహర్, మహ్మద్ సిరాజ్ ఎక్కువ పరుగులు సమర్పించుకున్నారని, ఈ నేపథ్యంలో వెంకటే‌శ్‌కు బౌలింగ్ ఇచ్చి ఉంటే బాగుండేదని అన్నాడు. సీనియర్ బౌలర్లు అయిన భువనేశ్వర్ కుమార్, రవిచంద్రన్ అశ్విన్ చాలా పొదుపుగా బౌలింగ్ చేశారని, వారు తమ అనుభవాన్ని ఉపయోగించారని ఆకాశ్ చోప్రా ప్రశంసించాడు. 

Updated Date - 2021-11-19T03:08:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising