ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

6 బంతుల్లో 6 సిక్సులు.. ఆఖరి ఓవర్లో అదిరిపోయే విక్టరీ

ABN, First Publish Date - 2021-07-18T06:46:36+05:30

మ్యాచ్ ఫైనల్ ఓవర్‌కు చేరుకుంది. గెలవాలంటే బ్యాట్స్‌మన్ జట్టు 6 బంతుల్లో 35 పరుగులు చేయాలి. చేతిలో ఉంది 3 వికెట్లు. ఇక ఇది అసాధ్యమేనని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మ్యాచ్ ఫైనల్ ఓవర్‌కు చేరుకుంది. గెలవాలంటే బ్యాట్స్‌మన్ జట్టు 6 బంతుల్లో 35 పరుగులు చేయాలి. చేతిలో ఉంది 3 వికెట్లు. ఇక ఇది అసాధ్యమేనని అంతా అనుకున్నారు. కానీ క్రీజులో ఉన్న బ్యాట్స్‌మన్ ఏ మాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. చివరి 6 బంతులనూ 6 సిక్సర్లుగా మలిచి జట్టుకు అదిరిపోయే విక్టరీని అందించాడు. ఈ అనూహ్యమైన ఘటన ఇర్లాండ్ ఎల్‌వీఎస్‌ టీ20 లీగ్‌లో చోటు చేసుకుంది. లీగ్ ఫైనల్‌ మ్యాచ్‌లో క్రెగాగ్, బాలీమెనా జట్లు తలపడగా.. అందులో క్రెగాగ్ జట్టు నిర్ణీత ఓవర్లకు 147 పరుగులు చేసింది. ఛేజింగ్‌కు దిగిన బాలీమెనా మొదటి నుంచే కష్టాల్లో కూరుకుపోయింది. చివరికి 19 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి కేవలం 113 పరుగులు మాత్రమే చేసి దాదాపు ఓటమి అంచుకు చేరుకుంది.


అయితే చివరి ఓవర్లో బాలీమెనా బ్యాట్స్‌మెన్ గ్లాస్(87నాటౌట్) మైదానంలో అద్భుతం సృష్టించాడు. చివరి 6 బంతులనూ భారీ సక్సర్లుగా మలిచి.. తన జట్టుకు ట్రోఫీని అందించాడు. ఇక ఇదే మ్యాచ్‌లో గ్లాస్ సోదరుడు సామ్ కూడా హ్యాట్రిక్ తీయడం విశేషం. అన్నదమ్ములిద్దరూ అదరగొట్టారన్నమాట. ఇక ఈ విషయం తెలుసుకున్న ఐర్లాండ్ క్రికెట్ అభిమానులు.. తమ దేశానికి కూడా ఓ క్రిస్ గేల్, సెహ్వాగ్, ఏబీ డివిలియర్స్ లాంటి ఆటగాడు దొరికాడంటూ తెగ సంబరపడిపోతున్నారు. 



Updated Date - 2021-07-18T06:46:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising