ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

21 రోజుల క్వారంటైనా..?

ABN, First Publish Date - 2021-05-12T10:48:49+05:30

ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన భారత ఏస్‌ షట్లర్‌ సాయి ప్రణీత్‌.. క్వారంటైన్‌ నిబంధనల కారణంగా సింగపూర్‌ ఓపెన్‌ నుంచి వైదొలిగాడు. జూన్‌ 1 నుంచి 5

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సింగపూర్‌లో ఆడలేమన్న సాయి ప్రణీత్‌, సిక్కి


న్యూఢిల్లీ: ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన భారత ఏస్‌ షట్లర్‌ సాయి ప్రణీత్‌.. క్వారంటైన్‌ నిబంధనల కారణంగా సింగపూర్‌ ఓపెన్‌ నుంచి వైదొలిగాడు. జూన్‌ 1 నుంచి 5 వరకు సింగపూర్‌ ఓపెన్‌ జరగనుంది. అయితే, టోర్నీలో పాల్గొనే భారత షట్లర్లు 21 రోజులు క్వారంటైన్‌లో ఉండాలనే నిబంధన విధించారు. ‘21 రోజులు క్వారంటైన్‌లో ఉండడం కష్టం. 14 రోజులు ఐసోలేషన్‌లో ఉంటేనే ఆడలేకపోతాం’ అని ప్రణీత్‌ వెల్లడించాడు. మహిళల డబుల్స్‌ జోడీ అశ్విని పొన్నప్ప-సిక్కిరెడ్డి కూడా టోర్నీ నుంచి విరమించుకొంది.


దీంతో వారి ఒలింపిక్స్‌ అర్హత అవకాశాలు చేజారినట్టే! మిగతా భారత షట్లర్లు కూడా వీరి బాటలోనే నడిచే అవకాశం ఉంది. కరోనా రెండో దశ విజృంభణ కారణంగా భారత దేశ ప్రయాణాలపై అనేక దేశాలు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత ఆటగాళ్లను 21 రోజులు తప్పనిసరిగా క్వారంటైన్‌లో ఉండాలని నిర్వాహకులు ఒత్తిడి చేస్తుండడంతో షట్లర్లు ఎటూ తేల్చుకోలేని పరిస్థితుల్లో టోర్నీకి దూరమవుతున్నారు. 

Updated Date - 2021-05-12T10:48:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising