ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నష్టపరిహారం చెల్లించే వరకు `ఎవర్ గివెన్`ను వదలం: ఈజిప్టు

ABN, First Publish Date - 2021-04-12T16:45:57+05:30

దాదాపు వారం రోజుల పాటు సూయజ్ కాలువను బ్లాక్ చేసి భారీ నష్టానికి కారణమైన `ఎవర్ గివెన్`ను సులభంగా వదలిపెట్టబోమని సూయజ్ కెనాల్ అథారిటీ (ఈజిప్టు) ఛైర్మన్ వెల్లడించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దాదాపు వారం రోజుల పాటు సూయజ్ కాలువను బ్లాక్ చేసి భారీ నష్టానికి కారణమైన `ఎవర్ గివెన్`ను సులభంగా వదలిపెట్టబోమని సూయజ్ కెనాల్ అథారిటీ (ఈజిప్టు) ఛైర్మన్ వెల్లడించారు. భారీ నష్టపరిహారం చెల్లించిన తర్వాతే `ఎవర్ గివెన్`ను వదలిపెడతామని తెలిపారు. మార్చి 23వ తేదీ ఉదయం ఈజిప్టుకు సమీపంలో భారీ కంటైనర్ `ఎవర్ గివెన్` సూయజ్ కాలువకు అడ్డంగా ఆగిపోయిన సంగతి తెలిసిందే. దీంతో ఆ మార్గంలో భారీగా ట్రాపిక్ జామ్ అయింది.


ఎంతో ప్రయ్నతించిన తర్వాత సుమారు వారం రోజుల అనంతరం ఆ నౌకను పక్కకు జరపగలిగారు. ఈ భారీ కంటైనర్ వల్ల సూయజ్ కెనాల్ మేనేజ్‌మెంట్‌కు తీవ్ర నష్టం వాటిల్లింది. మార్గానికి అడ్డంగా ఈ కంటైనర్ ఆగిపోవడం గురించి ప్రస్తుతం విచారణ జరుగుతోంది. విచారణ పూర్తయి, నష్ట పరిహారం కూడా అందిన తర్వాతే ఆ కంటైనర్‌ను విడిచి పెడతామని ఈజిప్టు వెల్లడించింది. సుమారు బిలియన్ డాలర్ల నష్టపరిహారాన్ని ఈజిప్టు ఆశిస్తున్నట్టు సమాచారం.  


Updated Date - 2021-04-12T16:45:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising