ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వర్షాలు కురవాలని గీతాగానం చేస్తూ నగ్నంగా రోడ్లపై పరుగులు!

ABN, First Publish Date - 2021-09-07T13:38:16+05:30

మధ్యప్రదేశ్‌లోని దమోహ్ జిల్లాలో గత ఏడాదితో పోలిస్తే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దమోహ్: మధ్యప్రదేశ్‌లోని దమోహ్ జిల్లాలో గత ఏడాదితో పోలిస్తే ఈసారి వర్షాలు తక్కువగా కురుస్తున్నాయి. ఫలితంగా వరి పంట ఎండిపోతోంది. దీంతో జిల్లాలో సమృద్ధిగా వర్షాలు కురవాలని వివిధ గ్రామాల్లో ఆచారాల పేరిట మూఢనమ్మకాలతో కూడిన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపధ్యంలో దామోహ్ జిల్లాలోని బనియా గ్రామంలో జరిగిన తంతు గురించి తెలిస్తే ఎవరైనా సరే తెగ ఆశ్చర్యపోతారు. 


ఈ గ్రామానికి చెందిన మహిళలు తమ చిన్నారుల వంటిమీదనున్న దుస్తులు విప్పి, వారి చేత గీతాగానం చేయిస్తూ రోడ్లపై పరుగులు పెట్టించారు. గ్రామంలో వర్షాలు కురవక పంటలు ఎండిపోతున్నాయని, చిన్నారులను నగ్నంగా ఊరేగిస్తే, వర్షాలు కురుస్తాయని నమ్ముతున్నామని గ్రామానికి చెందిన మహిళలు తెలిపారు. ఈ కార్యక్రమం కోసం గ్రామంలోని మహిళలంతా ఒకచోట చేరి, కప్పలకు తాళ్లు కట్టారు. తరువాత తమ ఇళ్లలోని చిన్నారులను నగ్నంగా మార్చి వారి భుజాలపై... తాళ్లతో కట్టిన కప్పలను ఉంచి వారిని గ్రామంలో ఊరేగించారు. అయితే పోలీసులకు ఈ ఉదంతం గురించి తెలియడంతో వారు చర్యలకు ఉపక్రమించారు.

Updated Date - 2021-09-07T13:38:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising