ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చాణ‌క్య‌నీతి: ఈ నాలుగు విషయాల్లో పురుషుల కంటే మహిళలు చాలా శక్తిమంతులు... అవేంటో తెలిస్తే షాక‌వుతారు!

ABN, First Publish Date - 2021-10-16T19:17:48+05:30

ఆచార్య చాణక్య తన జీవితాంతం అనేక వివాదాలను ఎదుర్కొన్నారు. చాణక్య త‌న జీవిత‌కాలంలో ఎన్నడూ, అటువంటి పరిస్థితుల‌లోనూ హడావుడిప‌డ‌లేదు. అసహనానికి గురికాలేదు. ఎలాంటి పరిస్థితుల‌నైనా ధైర్యంగా ఎదుర్కోవడంలో ముందున్నారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆచార్య చాణక్య తన జీవితాంతం అనేక వివాదాలను ఎదుర్కొన్నారు. చాణక్య త‌న జీవిత‌కాలంలో ఎన్నడూ, అటువంటి పరిస్థితుల‌లోనూ హడావుడిప‌డ‌లేదు. అసహనానికి గురికాలేదు. ఎలాంటి పరిస్థితుల‌నైనా ధైర్యంగా ఎదుర్కోవడంలో ముందున్నారు. దుర్భ‌ర‌ పరిస్థితులు ఎదురైనా వాటిని జీవిత పాఠాలుగా మ‌ల‌చుకున్నారు. అవే వారు ఇత‌రుల‌కు అందించిన చాణక్య విధానాలుగా మారాయి. ప్ర‌జ‌ల‌కు జీవ‌న మార్గాన్ని సుగమం చేశాయి.


ఆచార్య చాణక్య తెలిపిన వివ‌రాల ప్రకారం.. కొన్ని విషయాలలో పురుషుల కంటే మహిళలు ఎంతో శక్తిమంతులు. అలాగే పురుషుల కంటే మహిళలు ఎంతో సాహసం క‌లిగిన‌వారు. తెలివైనవారు. ఆచార్య చాణక్య.. తన చాణక్య నీతి గ్రంథంలో రాసిన ఆచ‌ర‌ణ‌యోగ్య‌మైన నీతి సూత్రాల‌ను మనం పాటిస్తే, మనకు ఉత్త‌మ‌మైన‌ జీవిత మార్గదర్శకత్వం లభిస్తుంది. చాణక్యుని జీవితం త్యాగం, తేజస్సు, పట్టుదల, పురుషత్వానికి చిహ్నాలుగా నిలిచాయి. ఆచార్య చాణక్యుడు చాలా సంవత్సరాల‌పాటు విద్యార్థుల‌కు తక్షశిలలో బోధ చేశారు. అలాంటి ఆచార్య చాణక్య‌.. పురుషుల కంటే స్త్రీలను ఉన్నతులుగా, శక్తిమంతులుగా అభివ‌ర్ణించారు. అలా ఎందుకు చెప్పారో దానికి వివ‌ర‌ణ కూడా ఇచ్చారు. 


1. ఆచార్య చాణక్య ప్రకారం పురుషుల కంటే మహిళలు ఎక్కువ ఆహారం తింటారు. పురుషులతో పోల్చిచూస్తే మహిళలు రెండు రెట్లు ఆకలితో ఉంటారు. ఎందుకంటే పురుషుల కంటే మ‌హిళ‌లు ఎక్కువగా కష్టపడుతుంటారు.


2. చాణక్య నీతి ప్రకారం మహిళలు పురుషులక‌న్నా తెలివైనవారు. పురుషులతో పోల్చిచూస్తే మ‌హిళ‌లు తమ తెలివితేటలను అనేక సంద‌ర్భాల‌లో అధికంగా వినియోగిస్తుంటారు. కష్టాలు వచ్చినప్పుడు మహిళలు అసహనానికి గురికారు. దృఢంగా నిలబడి పరిస్థితులను ఎదుర్కొంటారు.


3. పురుషుల కంటే మహిళలు ఎనిమిది రెట్లు ఎక్కువగా లైంగిక వాంఛ క‌లిగి ఉంటారు. నిజానికి మహిళలు త‌మ శృంగార శక్తిని బాహ్యంగా వ్యక్తీకరించే అవకాశం ఉన్న‌ప్ప‌టికీ, అలా చేయ‌ర‌ని చాణక్య తెలిపారు.


4. పురుషుల కంటే మహిళలు సాహసవంతులు. చాణక్య చెప్పినట్లు పురుషుల‌తో పోల్చిచూస్తే మ‌హిళ‌ల‌లో సాహసం ఆరురెట్లు ఉంటుంది. చాలా విషయాల్లో పురుషుల కంటే స్త్రీలు చాలా ముందుంటారు.

Updated Date - 2021-10-16T19:17:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising