ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చోరీకి వచ్చినోళ్లే భర్తను చంపారనుకున్న పోలీసులు.. గూగుల్ సెర్చ్ హిస్టరీతో అడ్డంగా బుక్కయిన భార్య..!

ABN, First Publish Date - 2021-06-22T00:52:46+05:30

గూగల్ సెర్చ్ హిస్టరీ ఆధారంగా మధ్యప్రదేశ్ పోలీసులు ఓ హత్య కేసును ఛేదించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గూగల్ సెర్చ్ హిస్టరీ ఆధారంగా మధ్యప్రదేశ్ పోలీసులు ఓ హత్య కేసును ఛేదించారు. మొదట దొంగతనానికి వచ్చిన వాళ్లే ఆమిర్‌ను చంపారనుకున్న పోలీసులు.. చివరికి భార్య చేతిలోనే అతడు హతమయ్యాడని కనిపెట్టారు. మధ్యప్రదేశ్‌లోని హర్దా జిల్లాకు చెందిన తబస్సుమ్ ఈ నెల 18న తన భర్త ఆమిర్ హత్య గురించి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. అక్కడకు చేరుకున్న పోలీసులు ఇంటిని పరిశీలించి దొంగతనం చేయడానికి ఇంటికి వచ్చిన వాళ్లే ఆమిర్‌ను హత్య చేసి ఉంటారని భావించారు. 


విచారణ సాగుతున్న కొద్దీ ఆమిర్ భార్యే అసలు నిందితురాలనే అనుమానం పోలీసులకు కలిగింది. ఆమె ఫోన్‌ను పరిశీలించగా ఇర్ఫాన్ అనే వ్యక్తికి ఎక్కువ సార్లు కాల్స్ వెళ్లినట్టు గుర్తించారు. అనంతరం ఆమె గూగుల్ హిస్టరీని పరిశీలించగా.. `ఓ వ్యక్తిని సులభంగా చంపడం ఎలా?, శవాన్ని మాయం చేయడం ఎలా?` అనే అంశాల గురించి ఎక్కువ సార్లు శోధించినట్టు తేలింది. దీంతో ఆమెను విచారించగా.. ఇర్ఫాన్ సహాయంతో తనే భర్తను చంపినట్టు అంగీకరించింది. తన వివాహేతర సంబంధానికి అడ్డు తొలగించుకోవాలనే భర్తను హత్య చేసినట్టు చెప్పింది. దీంతో పోలీసులు ఆమెపై, ఇర్ఫాన్‌పై కేసు నమోదు చేశారు. 

Updated Date - 2021-06-22T00:52:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising