ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

46 ఏళ్ల కిందట పోయిన పర్సు.. మళ్లీ ఎలా దొరికిందంటే..

ABN, First Publish Date - 2021-06-15T01:42:27+05:30

లిఫోర్నియాకు చెందిన ఓ మహిళ 46 ఏళ్ల క్రితం పోగొట్టుకున్న పర్సును తిరిగి పొందింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మనం ఏదైనా వస్తువును పోగొట్టుకుంటే ఒక పది, పదిహేను రోజులు దాని గురించి వెతుకుతాం. ఆ లోపు దొరక్కపోతే దాని గురించి ఆశలు వదిలేసుకుంటాం. ఇక దొరకదని అనుకుంటాం. అయితే కాలిఫోర్నియాకు చెందిన ఓ మహిళ 46 ఏళ్ల క్రితం పోగొట్టుకున్న పర్సును తిరిగి పొందింది. దీంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. 


కొలీన్ డిస్టిన్ అనే మహిళ కాలిఫోర్నియాలోని మెజిస్టిక్ వెంచురా థియేటర్‌లో పనిచేసేది. 46 ఏళ్ల క్రితం ఒక రోజు ఆమె తన పర్సు పోగొట్టుకుంది. ఎంత వెతికినా ఆ పర్సు దొరకలేదు. దీంతో ఆమె దాని గురించి మరిచిపోయింది. ఇటీవల ఆ సినిమా హాల్‌ను రీమోడలింగ్ చేశారు. ఆ సమయంలో అక్కడ పనిచేస్తున్న టామ్ స్టెవెన్ అనే యువకుడికి ఆ పర్సు కనిపించింది. అతడు ఆ పర్సును ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. `కొలీన్ డిస్టిన్ ఎవరో మీకు తెలుసా?` అంటూ ఆమె డ్రైవింగ్ లైసెన్స్ కార్డును పోస్టు చేశాడు. ఆ పోస్టును, తన పర్సును చూసి కొలీన్ ఆశ్చర్యపోయింది. వెంటనే అతడికి ఫోన్ చేసి పర్సు తీసుకుంది. అందులో ఉన్న తన డ్రైవింగ్ లైసెన్స్, తల్లి ఫొటో చెక్కు చెదరలేదు. అయితే ఒకప్పుడు ఎర్ర రంగులో ఉండే పర్సు రంగు మాత్రం బ్రౌన్ కలర్‌లోకి మారిపోయింది. 

Updated Date - 2021-06-15T01:42:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising