ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చనిపోదామని రైల్వే ట్రాక్ మీద పడుకుంది.. చిన్న గీత కూడా పడకుండా..

ABN, First Publish Date - 2021-06-20T02:50:38+05:30

భూమి మీద నూకలు ఉంటే.. ఏం జరిగినా బ్రతుకుతారనేందుకు ప్రత్యక్ష నిదర్శనమిది.. 30 ఏళ్ల ఓ మహిళ ఆత్మహత్య ....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

థానే: భూమి మీద నూకలు ఉంటే.. ఏం జరిగినా బ్రతుకుతారనేందుకు ప్రత్యక్ష నిదర్శనమిది.. 30 ఏళ్ల ఓ మహిళ ఆత్మహత్య చేసుకునేందుకు వెళ్లి రైలుపట్టాల పక్కన పడుకున్నప్పటికీ ఆమెకు చిన్న గాయం కూడా కాకుండా తప్పించుకుంది. మహారాష్ట్రలోని థానే జిల్లా బద్లాపూర్ రైల్వే స్టేషన్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ముగ్గురు పిల్లల ఆ తల్లికి మతిస్థిమితం లేదని ప్రాథమిక విచారణలో తేలిందని ఓ పోలీస్ అధికారి వెల్లడించారు. ‘‘శుక్రవారం ఉదయం బద్లాపూర్ రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫామ్ కింద రైల్వే ట్రాక్ పక్కనే ఆమె పడుకుంది. ఉదయం 9:30 సమయంలో ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్లాట్‌ఫామ్ దాటేసి వెళ్లిపోయింది కానీ ఆమెకు ఒక్క గీత కూడా పడకుండా తప్పించుకుంది. ట్రాక్ పక్కన ఉన్న ఆమెను ట్రైన్ గార్డు చూసి రైలు ఆపారు. అయితే ఒక్క బోగీ మినహా రైలు మొత్తం అప్పటికే ముందుకెళ్లిపోయింది...’’ అని కల్యాణ్ జీఆర్పీ ఇన్‌స్పెక్టర్ వాల్మీక్ శార్దూల్ పేర్కొన్నారు. ఆమె బతకడం నిజంగా అదృష్టమేనని ఆయన అన్నారు. కొద్ది సేపటి తర్వాత సదరు మహిళను ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించినట్టు శార్దూల్ వెల్లడించారు. కాగా తమ కుమార్తె ఇంట్లో చెప్పకుండానే శుక్రవారం ఉదయం బయటికి వెళ్లిపోయిందని ఆమె తల్లి పేర్కొన్నారు. ‘‘ఆమెకు మతిస్థితిమం లేదు..’’ అని ఆమె తెలిపారు. 

Updated Date - 2021-06-20T02:50:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising