ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అద్భుత శక్తులపై నమ్మకం: కుమారుని మృతదేహంతో తల్లి సహవాసం... చివరికి ఆత్మహత్య!

ABN, First Publish Date - 2021-07-31T16:03:40+05:30

హిమాచల్‌లోని చంబాలో ఒక మహిళ తన 20 ఏళ్ల కుమారుడు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చంబా: హిమాచల్‌లోని చంబాలో ఒక మహిళ తన 20 ఏళ్ల కుమారుడు మరణించిన అనంతరం అతని మృతదేహంతో కొన్ని నెలల పాటు సహవాసం చేసింది. ఏవో అద్భుత శక్తులు తన కుమారుడిని బతికిస్తాయని నమ్మి ఆమె ఈ పని చేసింది. ఈ ఉదంతం చంబా జిల్లాలోని అదివాసీ గ్రామం రీ పంచాయతీలో జరిగింది. చంబాలోని జవహర్ జవహర్ లాల్ నెహ్రూ మెడికల్ కాలేజీలో ఏదో వ్యాధికి చికిత్స పొందుతున్నతన 15 ఏళ్ల కుమార్తె మృతి చెందడంతో ఆమె తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ నేపధ్యంలోనే ఈ విషయం వెలుగు చూసింది.  


చంబా పోలీసు అధికారి ఎస్ అరుల్ కుమార్ మాట్లాడుతూ.. రీ పంచాయతీ పరిధిలోని ఒక మహిళ ఆత్మహత్య చేసుకున్నదని పోలీసులకు సమాచారం అందిందన్నారు. దీంతో పోలీసుల బృందం సంఘటనా స్థలానికి వెళ్లగా, మృతురాలి భర్త పోలీసులతో... గత కొంతకాలంగా తమ కుమార్తె అనారోగ్యంతో బాధపడుతూ చంబాలో చికిత్స పొందుతున్నదని తెలిపాడు. తమ కుమార్తె అంత్యక్రియలు ముగిసిన అనంతరం తన భార్య ఆత్మహత్య చేసుకున్నదన్నారు. కాగా పోలీసులు వారి ఇంటిలోని మరోగది తలుపులు తెరవగా, మంచంపై మరో మృతదేహం కనిపించింది. పోలీసులు దానిని వారి కుమారుని మృతదేహంగా గుర్తించారు. దీంతో పోలీసులు ఆ మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. నాలుగు నెలల క్రితమే వారి కుమారుడు మరణించి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ మృతదేహాన్ని అద్భుత శక్తుల బతికిస్తాయని మృతురాలు కొడుకు మృతదేహాన్ని ఇంటిలో ఉంచిందని పోలీసులు భావస్తున్నారు. ఈ ఉదంతంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 


Updated Date - 2021-07-31T16:03:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising