ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆమె పెదాలపై ఏదో పాకింది.. మర్నాటికి బెలూన్‌లా ఉబ్బిపోయింది.. అసలు విషయం తెలియగానే హడలెత్తిపోయి...

ABN, First Publish Date - 2021-10-09T14:18:44+05:30

ఏవో తెలియని విషపురుగులు కుట్టినపుడు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏవో తెలియని విషపురుగులు కుట్టినపుడు మనిషికి తీవ్రమైన భయాందోళనలు కలగడం సహజం. ఒక మహిళకు ఇటువంటి అనుభవమే ఎదురవడంతో ఆమె తల్లడిల్లిపోయింది. షెర్రీ మాడాక్స్ అనే మహిళ పెదవులపై విషపు సాలీడు కుట్టింది. దీంతో ఆసుపత్రిలో చేరిన ఆమె చనిపోతానని భయపడింది. షెర్రీ యుఎస్‌లోని స్టౌంటన్ నదిలో 10 గంటల పాటు కయాక్ యాత్రలో ఉన్నప్పుడు ఆమె పెదాలపై సాలీడు కుట్టింది. ఈ  కాటు తీవ్రతను ఆమె తొలుత గుర్తించలేదు. మరుసటి రోజు పెదాలపై షెర్రీకి నొప్పిగా అనిపించడంతో ఆమె యాంటీబయాటిక్స్ తీసుకుంది. 


అయితే ఆమె పెదవి మరింతగా ఉబ్బిపోవడంతో పాటు, నొప్పి తీవ్రమయ్యింది. ఈ సందర్భంగా బాధితురాలు షెర్రీ మాట్లాడుతూ.. నాకు ఇప్పుడు 50 ఏళ్లు. నేను 6 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పటి నుంచి స్టౌంటన్ నదిలో ఈత కొడుతున్నానని తెలిపింది.. నేను సాలీడు విషానికి సంబంధించిన భయానక కథలు విన్నాను. అందుకే భయం వేసింది. అందుకే భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని తెలిపింది. తాను ఆసుపత్రిలో ఉన్న మొదటి ఐదు రోజులు ఎంతో భయపడ్డాను. స్పైడర్ విషం ఎంతటి ప్రమాదకారి అనేది నేను గతంలో చాలామంది చెప్పగా విన్నానని తెలిపారు. కాగా షెర్రీని.. రెక్లూస్ స్పైడర్ కుట్టిందని వైద్యులు తెలుసుకున్నారు. ఈ సాలీడును 'వయోలిన్ స్పైడర్' అని కూడా అంటారు. కాగా షెర్రీ పెదవుల వాపు తగ్గినప్పటికీ ప్రస్తుతం ఆమె యాంటీబయాటిక్స్ తీసుకుంటోంది.

Updated Date - 2021-10-09T14:18:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising